రాజన్న సిరిసిల్ల, జనవరి -23
సిరిసిల్ల అంబేద్కర్ నగర్ యూపీహెచ్ సీలో టీబీ పేషెంట్లకు పోషకాహార కిట్ల పంపిణీ
టీబీ పేషెంట్లు కచ్చితంగా నిత్యం పోషకాహారం తీసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనీ అంబేద్కర్ నగర్ లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం టీబీ బాధితులకు పోషకాహార కిట్లు, కోడిగుడ్లను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడారు. టీబీ ముక్త్ భారత్ లో భాగంగా జిల్లాలోని అన్ని పీహెచ్ సీలు, అర్బన్ హెల్త్ సెంటర్, ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, బస్తీ దవఖానాల్లో ఆరోగ్య పరీక్షలు చేస్తారని వివరించారు. అలాగే మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రతి నెలా రూ. వెయ్యి సహాయం అందిస్తున్నారని వెల్లడించారు. పేషెంట్లు కచ్చితంగా మందులు వాడుతూ.. పోషకాహారం తీసుకోవాలని సూచించారు. టీబీ నియంత్రణకు నిక్షయ మిత్ర ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ నిర్వహించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పట్టణాలు, మండలాల్లో కలిపి మొత్తం 353 మందికి పోషకాహార కిట్లు పంపిణీ చేశారు.సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రజిత, ఐఎంఏ అధ్యక్షురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
పోషకాహారం నిత్యం తీసుకోవాలి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **
మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కోనాపూర్ లో గురుకుల పాఠశాల నిర్మాణ పనులలో జాప్యం. నేటి ప్రభాతదర్శిని బాన్సువాడ ప్రతినిధి.