• Other News
  • Live TV
  • బాధితునికి మెరుగైన వైద్యం కోసం 10వేల ఆర్థికసాయం అందజేత వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

    Reporter
    admin January 9, 2026, 12:53 pm
    బాధితునికి మెరుగైన వైద్యం కోసం 10వేల ఆర్థికసాయం అందజేత   వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

    మానవత్వం మిగిలే ఉంది అని నిరూపించిన దాతలు
    బాధితునికి మెరుగైన వైద్యం కోసం 10వేల ఆర్థికసాయం అందజేత
    నాంపల్లి గ్రామానికి చెందిన శనిగరపు శైనుకు ఉండడానికి కూడా స్వంత ఇల్లు లేక వేరేవాళ్లు కట్టి విడిచి పెట్టిన ఇల్లు ఉంటే అనారోగ్యంతో ఉన్న శైనును ఆ ఇంట్లో ఇతన్ని పడవేశారు. ఆటో నడుపుతూ జీవనము కొనసాగిస్తున్న క్రమంలో విధివక్రించి ఇతనికి కుడి కాలు చేయి పడిపోయింది. మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి వేములవాడలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో చూపిస్తే ఇక్కడ ట్రీట్మెంట్ లేదు కరీంనగర్ తీసుకొని వెళ్ళమని అక్కడి డాక్టర్లు చెప్పారని ఇతనికి ఇంకా బ్లడ్ క్లాట్ అవుతుందని అతని చేతిలో చిల్లిగవ్వ లేక మెరుగైన వైద్యం కోసం ఎదురు చూస్తున్న నాంపల్లి గ్రామానికి చెందిన నిరుపేద శైనూకు మీ వంతు సహకారం అందించండని అతని బంధువులు సమాచారం ఇవ్వడంతో ట్రస్టు మరియు ఇతర వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేయగా దాతలు విరాళాల రూపంలో దాదాపు 7200 వరకు అందించగా ట్రస్టు ద్వారా మరికొంత కలిపి శైనూకు మెరుగైన వైద్యం కోసం 10వేల రూపాయలు అందించడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ వొడ్యాల వేణు మహమ్మద్ అబ్దుల్ రఫీక్ పాత్రికేయ మిత్రులు కనుకుల ఆనంతరెడ్డి సామల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర