• Other News
  • Live TV
  • సాయిల్ హెల్త్ ప్రోగ్రాం నేల ఆరోగ్యం, పోషక స్థితి అంచనా.. జీవవైవిధ్యం మెరుగు పంటల దిగుబడి పెంపు

    Reporter
    admin January 6, 2026, 4:32 pm
    సాయిల్  హెల్త్ ప్రోగ్రాం    నేల ఆరోగ్యం, పోషక స్థితి అంచనా.. జీవవైవిధ్యం మెరుగు    పంటల దిగుబడి పెంపు

    రసాయన ఎరువుల ఖర్చు తగ్గింపు
    వ్యవసాయం మరింత సుస్థిరం నేల మన సంపద – దాన్ని కాపాడుకోవడమే మన భవిష్యత్తు భద్రత” అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.
    నేల ఆరోగ్య పరిరక్షణ, పంట దిగుబడుల పెంపు, భవిష్యత్ తరాలకు సారవంతమైన నేలను అందించాలనే లక్ష్యంతో మోడల్ స్కూల్, చౌడారం లో
    స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు.నేల ఆరోగ్య పరిరక్షణపై జిల్లా కలెక్టర్
    ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ...“భూమి మనకు ఇచ్చిన అపారమైన వనరులలో నేల అత్యంత ముఖ్యమైనదని...నేల సారాన్ని కాపాడినప్పుడే వ్యవసాయం సుస్థిరంగా కొనసాగుతుంది” అని పేర్కొన్నారు.అధికంగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల నేల కాలుష్యం పెరిగి, నేలలోని సహజ సూక్ష్మజీవులు నశిస్తున్నాయని తెలిపారు. నేల సార పరీక్ష (Soil Fertility Analysis) చేయించుకోవడం ద్వారా అవసరమైన పోషకాలను మాత్రమే వినియోగించవచ్చని, దీని వల్ల పంట దిగుబడులు పెరగడమే కాకుండా నేల కాలుష్యం కూడా తగ్గుతుందని విద్యార్థులకు వివరించారు.విద్యార్థులు తమ పొలాల నుండి లేదా పరిసర రైతుల పొలాల నుండి నేల నమూనాలను సేకరించాలని, అలాగే ఈ అంశాన్ని తమ తల్లిదండ్రులకు వివరించి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.అనంతరం వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు వివరించిన నేల నమూనా సేకరణ విధానాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.నేల సంరక్షణపై సూచనలను...వ్యవసాయ శాఖ అధికారులు విద్యార్థులకు క్రింది అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించార సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ: అధిక రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల నేల జీవరాసులు నష్టపోతున్నాయని, జీవ కార్మిక మరియు సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం 22 రకాల నేలలతో సంపన్నమని వివరించారు. పచ్చి రొట్టె ఎరువుల వినియోగం: జీలుగా, జనుము, పిల్లిపెసర వంటి పచ్చి రొట్టె ఎరువుల పంటల వాడకం ద్వారా నేల సారాన్ని పెంపొందించవచ్చని, సూక్ష్మ పోషకాల కొరతను సహజ పద్ధతుల్లో తీర్చవచ్చని వివరించారు.
    వేసవికాలంలో దుక్కి దున్నే విధానం: వాలుకు అడ్డంగా దున్నడం వల్ల భూమి కోతను నివారించడంతో పాటు నేలలో కర్బన పదార్థాలు మరియు నేల నిర్మాణం కాపాడబడుతుందని తెలిపారు.లవణ సమస్య నివారణ:
    లోతైన బోర్లు తీయడం వల్ల లవణ సమస్యలు పెరుగుతున్నాయని, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చని సూచించారు.దీర్ఘకాలిక నేల పరిరక్షణ: ఒక అంగుళం నేల తయారవ్వడానికి శతాబ్దాల సమయం పడుతుందని, అందుకే నేల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు.చివరగా ప్రతి రైతు తప్పనిసరిగా నేల పరీక్ష చేయించుకొని, సిఫారసుల ప్రకారం ఎరువుల వినియోగం చేయాలని సూచించారు.విద్యార్థుల నమోదు, డిజిటల్ శిక్షణఈ స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్‌లో భాగంగా...50 మంది విద్యార్థులను స్కూల్ SHC (Soil Health Card) లాగిన్‌లో నమోదు చేశారుఈ విద్యార్థులు తమ పొలాల నుండి లేదా సమీప పొలాల నుండి నేల నమూనాలను సేకరించనున్నారు
    నేల నమూనా సేకరణలో పాటించాల్సిన డోస్ అండ్ డోంట్స్ ను వివరంగా తెలియజేశారుసేకరించిన నమూనాలను SAATHI యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారుఈ స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులను నేల ఆరోగ్య అవగాహన దూతలుగా తీర్చిదిద్దుతూ, వారి ద్వారా రైతు కుటుంబాల్లో శాస్త్రీయ నేల నిర్వహణ పద్ధతులపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, సహాయ జిల్లా విద్యాశాఖ అధికారి సత్యమూర్తి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు వెంకటరమణ, తేజస్వి, మండల వ్యవసాయ అధికారి విజయ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సుధీర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజేష్, అనిల్ పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow