మనిషి పుట్టుక నుండి చావు వరకు కులం అనేది చెరిపి వేయలేని ముద్ర ఒక కులంలో పుట్టిన వారిని మతం మారితే సాటివారు ఆ ఊరివారు పలాన కులం అని చెప్పకుండా ఉంటారా 59 షెడ్యూల్ కులాలైన షెడ్యూల్ ట్రైబల్స్ అయినా సామాజిక వివక్షతకు గురై పడలేక హక్కున చేర్చుకునే మతాల వైపు మొగ్గు చూపారు అంతమాత్రాన వారు కులం మారినట్టా...? కులం మారుతుందా..? మతం మారినంత మాత్రాన వారు వివక్షకు గురికాకుండా ఉంటారా...? దినదిన గండంగా బతుకు భారంగా చేసుకొని కుల దూషణలో మగ్గిపోతున్న వాళ్లు ఇప్పటికీ క్రైస్తవంలో ఉన్నారు. వారు ప్రేమ దయా కరుణ ను పంచుతూ వారి వారి జీవితాన్ని ముళ్ళబాటలపై పెట్టి నడుస్తున్నారు. మతం మారినంత మాత్రాన ఏదో కోటీశ్వరులు కాలేదు మతం మారినంత మాత్రాన వారిని ఓసీలుగానో ఎఫ్ సి లుగానో బీసీలుగానో సమాజం గుర్తించట్లేదు. ఒక ప్రభుత్వం తప్ప. వారిచ్చే బీసీ సర్టిఫికెట్లు వారి జీవితాన్ని మరింత అదః పాతాళానికి తొక్కి వేస్తూ అటు ఎస్సీ సర్టిఫికెట్ లేక ఇటు బీసీలుగా మనలేక సతమతమవుతూ అటు ఆకాశానికి ఇటు భూమికి తాకలేక డోలాయమాన స్థితిలో జీవితాలను వెల్లబుచ్చుతున్నారు. ఎస్సీలపై సుప్రీం తీర్పు నిజంగా బాధాకరం. న్యాయం దృష్టిలో హిందూమతంలో ఉన్నవారు మాత్రమే వివక్షకు గురి అవుతున్నారని మిగతా మతాలలో ఉన్నవారు సమానత్వాన్ని ప్రబోధిస్తున్నారని అనుకుంటుంది కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. క్రైస్తవ ఆచార వ్యవహారాలు పొందుతూ విద్యా ఉద్యోగ రంగాలలో హిందూ అని పెట్టుకోవడం ఆక్షేపనీయమే కానీ మతం వేరు...కులం వేరు...అది వ్యక్తిగత విశ్వాసమే కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మతం మారినంత మాత్రాన కులం మారదు చూసే కోణం మారదు. వివక్ష మారదు... వ్యక్తిగతంగా సామాజిక దూరాన్ని పాటించాల్సిందే... పాటిస్తున్నారు... పాటించేలా చేస్తున్నారు కూడా.. స్మశానాలలో కూడా దళిత క్రైస్తవుల సమాధులు వేరుగానే ఉంటున్నాయి అంటే సామాజిక వ్యవస్థలో వివక్ష ఎంత వేళ్ళునుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు . ఊర్లలో వాడల్లో వారి వృత్తుల్లో ఎలాంటి మార్పు లేదు. వివిధ చర్చిలలో వివాహాలు గాని ప్రార్ధన స్థలాలలో గాని కులం అనేది ప్రామాణికంగా చూస్తూ ఉన్నాయి. అంటే మతం మారిన తర్వాత కూడా ఏ కులము పిల్లను ఆ కులం వారే చేసుకోవాలి కానీ ఇతర కులం పిల్లలను చేసుకోవడానికి అగ్రవర్ణాలు సుముఖంగా లేవు. అంటే కులం ఎక్కడ మారింది..? వివక్షత ఎక్కడ మారింది...? గ్రామాలలో దళిత క్రైస్తవ అగ్రవర్ణాల వాళ్లు కూడా దళిత క్రైస్తవులు వాకిట్లో నుండి వెళ్లిన...వారు వెళ్లినచోట పసుపు నీళ్లను చల్లి శుద్ధి చేసుకున్న సందర్భాలు క్రైస్తవ్యంలో కూడా వివక్షత కు అద్ధం పడుతుంది. ప్రభుత్వాలు దళిత క్రైస్తవులపై అధ్యయనం చేసిన కమిషన్లు కూడా వారి స్థితిగతులను కళ్ళకు కట్టినట్టు చూపించాయి. హిందూ దళితులపై ఎలాంటి వివక్ష ఉందో క్రిస్టియన్ దళితులపై కూడా అలాంటి వివక్షనే ఉంది ఇది సత్యం అని కుమార్ పిళ్ళై రంగనాథ స్వామి కమిషన్ తేట తెల్లం చేశాయి. దళిత క్రైస్తవులు ఎస్సీ హోదాలో ఉండి 15% రిజర్వేషన్లు కోల్పోయి ఒక శాతం ఉన్న బీసీల్లో అవకాశాలు లేక ఆదరణ లేక అల్లాడిపోతున్నాయి. 14 15 16 అధికరణల ప్రకారం పౌరులందరూ సమానమని మత ప్రాతిపదికన వివక్ష చూపకూడదని ఉంది. హిందువుల తర్వాత సిక్కు బౌద్ధం మాత్రమే ఎస్సీ హోదాను కలిగి ఉండడం రాజ్యాంగ ప్రాథమిక సూత్ర అధికరణలకు విరుద్ధం అని అనేక మేధావుల వాదన. ప్రభుత్వాలు న్యాయవ్యవస్థలు దళిత క్రైస్తవులను మతకోణంలో కాకుండా మానవీయ కోణంలో వారి యొక్క స్థితిగతులను సామాజిక వివక్షతను అణచబాటు తనాన్ని పరిశీలించి రాజ్యాంగపరంగా రక్షణ కల్పించి అందరికీ సమన్యాయం కల్పించినప్పుడే సమ సమాజ నిర్మాణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నా స్వరాజ్యం ఏర్పడుతుంది.
TELANGANA
మతం మారితే కులం మారడం ఏమిటి..?
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **
మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కోనాపూర్ లో గురుకుల పాఠశాల నిర్మాణ పనులలో జాప్యం. నేటి ప్రభాతదర్శిని బాన్సువాడ ప్రతినిధి.