పది పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
శనివారం, జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) మండల పరిధిలో గల జెడ్పీఎస్ఎస్, అలాగే అదే మండలంలోని ఛాగల్ గ్రామంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ సరళిని పరిశీలించారు.
పరీక్షకు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారని సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, ఇతర మౌలిక వసతులు, ఆరోగ్య శిబిరం వంటి వాటి గురించి ఆరా తీశారు.
ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించాలని, పరీక్ష పూర్తైన వెంటనే జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ తనిఖీలో సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.