అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి
ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1793 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున లక్ష్మీగణపతి, రాజన్న భీమేశ్వర ఆలయాల వద్ద గల పేదలకు అన్నార్తులకు దాతలు అందించిన సహకారంతో అన్న దానంతో పాటు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్న దాతలుగా అమావాస్య సందర్భంగా పెద్దల పేర పేదలకు అన్నదానం చేయాలన్న సంకల్పంతో కరీంనగర్ వాస్తవ్యులు పాత రాధాకిషన్ పావని దంపతులు మరియు జగిత్యాల వాస్తవ్యులు రుద్రంగి రాఘవేంద్ర శర్మ సుచిత్ర దంపతులు, మూడపల్లి వాస్తవ్యులు మామిండ్ల బాలరాజు మరియు కుటుంబ సభ్యులు శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంప తులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని మీయొక్క పుట్టినరోజు పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్య క్రమాలకు పేదలకు అన్నా ర్తులకు ఒక్క పూట భోజనం అందించడానికి సహకారం అందించే దాతలు ట్రస్టు సభ్యులను గాని 92469 39388 నంబరుకు సంప్రదించా లని, ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ సగ్గు రాహుల్ ముంజ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు