గ్రామ సమాఖ్య భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామంలో గ్రామ సమాఖ్య భవన నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణ పనులు ఎప్పుడు మొదలు పెట్టారో ఆరా తీశారు.
కావలసిన కార్మికులు, సామగ్రి సిద్ధం చేసుకోవాలని, భవన నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించారు. మండలంలో మంజూరు అయిన అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని, అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. టాయిలెట్ల నిర్మాణాలు సైతం నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. జన గణనలో భాగంగా ఇండ్ల గణనకు చేస్తున్న ప్రక్రియపై ఎంపీడీఓను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్ ఫరూఖ్, ఎంపీడీఓ శశికళ తదితరులు ఉన్నారు.