సోమవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నర్మేట్ట లోని పీహెచ్సి, కేజీబీవీ ని ఆకస్మిక తనిఖీ చేసారు
ఈ సందర్బంగా కలెక్టర్... పీహెచ్సి పరిసరాలను ముందుగా పరిశీలించి పలు సూచనలిచ్చారు
మందుల నిల్వ లను అలాగే వాటి మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ ని పరిశీలించారు
వైద్యానికి సరిపడా మందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.. సరిపడ మందులను, వ్యాక్సిన్ లను అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు
అనంతరం కెజిబివి ని సందర్శించి...చుట్టూ పరిసరాలలో పెరిగే...పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని తెలిపారు
నాణ్యముగా ఉన్నాయా లేదా అని
వంటకు సరకులను, పప్పు దినుసులను పరిశీలించారు.
అలాగే
మధ్యాహ్న భోజన తయారీ ని కూడా క్షుణ్ణం గా చూసి... జాగ్రత్త గా చేయాలనీ... ఎప్పటికప్పుడు వంట చేసే ప్రాంతం పరిశుభ్రం గా ఉండాలని, మెనూ ను తప్పకుండ పాటించాలని కలెక్టర్ తెలిపారు
పరీక్షలకు
ప్రిపేర్ అవుతున్న 10వ తరగతి విద్యార్థులకు .. మాథ్స్ సబ్జెక్ట్ లోని పలు అంశాలను కలెక్టర్ స్వయం గా నేర్పించి... వాటి మీద విద్యార్థులకు ఉన్న సామర్ధ్యన్ని కూడా కలెక్టర్ పరిశీంచారు