• Other News
  • Live TV
  • రాజన్న సిరిసిల్ల, మార్చి 13: రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు 34 కేంద్రాల్లో ఏర్పాట్లు పరీక్ష రాసే విద్యార్థులు అరగంట ముందే చేరుకోవాలి

    Reporter
    admin March 13, 2026, 3:26 pm
    రాజన్న సిరిసిల్ల, మార్చి 13: రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు  34 కేంద్రాల్లో ఏర్పాట్లు  పరీక్ష రాసే విద్యార్థులు అరగంట ముందే చేరుకోవాలి

    ఈ నెల 14వ తేదీ శనివారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. జిల్లాలోని 34 పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. నిర్ణీత పరీక్ష సమయం తరువాత ఐదు నిమిషాలు వరకు విద్యార్థులను అనుమతిస్తారు.

    34 కేంద్రాల్లో పరీక్షలు..

    పదో తరగతి పరీక్షలకు మొత్తం 7317 మంది విద్యార్థులు హాజరుకానుండగా, బాలురు 3511, బాలికలు 3806 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో డెస్క్ లు, తాగునీరు, టాయిలెట్స్, ట్యూబ్ లైట్స్ ఇతర సౌకర్యాలు కల్పించారు. జిల్లాలో 34 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

    కుసుమ రామయ్య జడ్పీ హైస్కూల్ (బాయ్స్) సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ వెంకంపేట సిరిసిల్ల, సిద్దార్థ ఇంగ్లిష్ మీడియం పత్తిపాక వీధి సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ అంబేద్కర్ నగర్ సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ (బాలికల) ఏ వింగ్ సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ (బాలికల) బీ వింగ్ సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ నెహ్రునగర్, ప్రభుత్వ హైస్కూల్ సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ (వొకేషనల్) తంగళ్ళపల్లి, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ చందుర్తి, జడ్పీ హైస్కూల్ రుద్రంగి, జడ్పీ హైస్కూల్ (వొకేషనల్) ఇల్లంతకుంట, కేరళ మోడల్ స్కూల్ ఇల్లంతకుంట, జడ్పీ హైస్కూల్ గాలిపెల్లి, జడ్పీ హైస్కూల్ జిల్లెల, జడ్పీ హైస్కూల్ లింగన్నపేట్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేములవాడ, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేములవాడ, గౌతం హైస్కూల్ వేములవాడ, జడ్పీ హైస్కూల్ (బాలికల) వేములవాడ, కిడ్స్ కాన్వెంట్ హైస్కూల్ వేములవాడ, హంసిని డిజి హైస్కూల్ వేములవాడ, జడ్పీ హైస్కూల్(బాయ్స్) గంభీరావుపేట్ (వొకేషనల్), జడ్పీ హైస్కూల్(బాలికల) గంభీరావుపేట్, జడ్పీ హైస్కూల్(బాయ్స్) ముస్తాబాద్, జడ్పీ హైస్కూల్(బాలికల) ముస్తాబాద్ (వొకేషనల్), జడ్పీ హైస్కూల్ ఎల్లారెడ్డిపేట ఏ వింగ్, జడ్పీ హైస్కూల్ ఎల్లారెడ్డిపేట బీ వింగ్, జడ్పీ హైస్కూల్ వీర్నపల్లి (వొకేషనల్), టీఎస్ మోడల్ స్కూల్ కోనరావుపేట, సిరిసిల్ల (వొకేషనల్), జడ్పీ హైస్కూల్ ధర్మారం, జడ్పీ హైస్కూల్ బోయినపల్లి(వొకేషనల్), జడ్పీ హైస్కూల్ విలాసాగర్ ల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

    144 సెక్షన్ అమలు..
    పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అలాగే పరీక్ష కేంద్రాల సమీపంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని అధికారులు సూచించారు.

    పర్యవేక్షణకు బృందాలు..
    పరీక్షల పర్యవేక్షణకు వివిధ శాఖల అధికారులతో బృందాలు ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెం డెంట్లు 34, డిపార్ట్ మెంటల్ అధికారులు 34, సిట్టింగ్ స్క్వాడ్ 34, ఫ్లయింగ్ స్క్వాడ్ రెండు టీంలు, అడిషనల్ డిపార్టుమెంటు ఆఫీసర్స్, స్టేట్ లెవెల్ అబ్జర్వర్స్, కస్టోడియన్ అధికారులను నియమించారు.

    ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
    పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. పరీక్షల మధ్య విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రశ్నాపత్రాలు మరోసారి చదివి..రాయాలి. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షా సమయనికంటే ముందే చేరుకోవాలి

    - గరిమ అగ్రవాల్, కలెక్టర్

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/