• Other News
  • Live TV
  • పీ ఎంశ్రీ స్కూళ్లలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

    Reporter
    admin February 20, 2026, 4:21 pm
    పీ ఎంశ్రీ స్కూళ్లలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

    రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి - 20

    జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపిక అయిన స్కూళ్లలో మొదలు పెట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
    పీఎంశ్రీ కింద ఎంపిక అయిన విద్యాలయాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై జిల్లా సమీకృత కార్యాలయంలో శుక్రవారం జిల్లా విద్యాధికారి, టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులతో ఇంచార్జి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

    పీఎంశ్రీ కింద జిల్లాలో మొత్తం 16 విద్యాలయాలు ఎంపిక అయ్యాయని, వాటిలో అదనపు తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్ లు, సైన్స్ ల్యాబ్ లు, లైబ్రరీలు, వర్షం నీరు ఇంకుడు గుంతలు ఇతర నిర్మాణాలు ఉన్నాయని ఇంచార్జి కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువెళ్ళారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు.
    పీఎంశ్రీ కింద ఎంపికైన విద్యాలయాల్లో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆయా స్కూళ్లలో పనులను జిల్లా విద్యాధికారి పరిశీలించాలని ఆదేశించారు. కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయాల్లో చేపట్టిన పనులను పూర్తి చేయాలని సూచించారు.
     
    సమీక్షలో జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, టీజీఈడబ్ల్యూఐడీసీ డీఈ సత్యనారాయణ రావు, ఏఈలు నాగరాజు, అశోక్ కుమార్, అధికారులు తదితరులు ఉన్నారు.
      
     

    📰 e-Paper Clip
    Google News Follow