• Other News
  • Live TV
  • అద్భుతం గా NDRF, మెడికల్, ఫైర్ మాక్ డ్రిల్

    Reporter
    admin February 18, 2026, 4:21 pm
     అద్భుతం గా NDRF, మెడికల్, ఫైర్ మాక్ డ్రిల్

    ఫిబ్రవరి 18
    జనగాం
    అద్భుతం గా NDRF, మెడికల్, ఫైర్ మాక్ డ్రిల్
    వరదల సమయం లో జాగ్రత్త చర్యల పైన అవగహన
    విపత్తుల సమయం లో ధైర్యం గా ఉండాలి
    రక్షణ చర్యల పైన అవగాహన ముఖ్యం
    జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
    అకాల వర్షాలు , విపత్కర పరిస్థితుల సమయం లో తీసుకోవలిసిన చర్యల పైన ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రజల్లో విపత్తుల పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యం తో...
    హైదరాబాద్‌కు చెందిన 10వ బెటాలియన్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం ఇన్‌చార్జ్‌ ఇన్‌స్పెక్టర్ ముఖేష్ కుమార్, సెకండ్ ఇన్‌చార్జ్‌ ఏఎస్సై రొడ్డా మద్దిలెట్టి బృందం లోని హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ ఇతర సిబ్బంది.. అలాగే జిల్లా మెడికల్ కాలేజ్ బృందం, జిల్లా అగ్ని మాపాక శాఖ అధికారులు అకాల వర్షాల వల్ల వరదలు సంభవించినప్పుడు...ప్రజలు ఎలా అప్రమత్తం గా ఉండాలి, తక్షణమే ఎలా స్పందించి.. ఎలా బయట పడాలి అనే తదితర అంశాల పైన బుధవారం నెల్లూట్ల చెరువు వద్ద చక్కటి మాక్ డ్రిల్ నిర్వహించారు
    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది గా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు
    ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ...కుండపోత గా వర్షాలు కురిసి వరదలు సంభవించినప్పుడు ప్రజలు భయపడకుండా ధైర్యం గా ఉండాలన్నారు ముఖ్యం గా లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని... వరదల్లో చిక్కుకున్నప్పుడు ఎలా బయట పడాలో తెలుసుకునేందుకు ఈ మాక్ డ్రిల్ కార్యక్రమం ఎంత గానో దోహదపడుతుందన్నారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో విపత్తు నివారణ లో భాగం గా ప్రాణ నష్టాలను నివారించడంలో NDRF, మెడికల్, ఫైర్ అధికారుల పాత్ర కీలకమన్నారు. అనంతరం NDRF, మెడికల్ బృందం, వరదల్లో చిక్కుకున్న ప్రజలు ఎలా బయట పడాలి... ఈత వచ్చినవారు, అలాగే ఈత రాని వారు ఎలాంటి ట్రిక్స్ ని పాటించాలి.... ఎవరి ప్రాణాలకైనా ముప్పు వాటిల్లీతే వారిని ఎలా కాపాడాలి, తక్షణమే తీసుకోవలిసిన చర్యల పైన ప్రాక్టీకల్ గా చక్కగా వివరించారు
    అలాగే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ... ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి,గృహల్లో గ్యాస్ వాడకం పట్ల ఎలా జాగ్రత్త గా ఉండాలి అనే అంశాల మీద అగ్ని మపాక అధికారులు సవివరంగా తెలిపారు
    ఈ మాక్ డ్రిల్ నిర్వహణ వల్ల చాలా అవగాహన కలిగిందని... ఇలాంటి కార్యక్రమాలు భయాలను తొలిగించి తక్షణమే తీసుకోవలిసిన చర్యలను సులభం గా అర్ధం చేసుకునే అవకాశాన్ని కలిగిస్తాయని...అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డివో గోపిరామ్, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, లింఘాల ఘనపూర్ తహసీల్దార్, CJIT లో జరుగుతున్న ట్రైనింగ్ లో ఉన్న 5 మండలాల సర్పంచ్ లు(చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, జాఫర్ఘడ్, రఘునాథ్ పల్లి,లింఘాల ఘనపూర్ ) పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర