పాతబస్తీలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
నేటి ప్రభాత దర్శిని ! హైదరాబాద్, చంద్రాయణ గుట్ట ! పాతబస్తీలోని 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలు. వాడవాడల్లో మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం భారత్ మాతాకీ జై. వందేమాతరం అంటూ నినాదాలు చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఒకరికొకరు కరచాలం చేసుకుని స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల పోరాట ఫలితం మన దేశ స్వాతంత్రం వచ్చిందని కొనియాడారు.