*84వ సారి రక్తదానం చేసిన డాక్టర్ బాలు*
*తల సేమియా చిన్నారి కదం కీర్తన కు రక్తం అందజేత*
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న నిర్మల్ జిల్లాకు చెందిన కదం కీర్తన (12) సంవత్సరాల అమ్మాయికి ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు నిజామాబాద్ బ్లడ్ సెంటర్లు 84 వ సారి రక్త దానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తల సేమియా వ్యాధి చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ వ్యక్తం వారి జీవితాంతం అవసరం ఉంటుందని ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 6000 మంది చిన్నారులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 250 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని వీరికి కావాల్సిన రక్తాన్ని అందజేయడానికి రక్తదాన శిబిరాలను మరిన్ని నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రంగ కిషన్, బీమా గౌడ్,బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు బట్టు భరద్వాజ్ లు పాల్గొనడం జరిగింది.