ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 07 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో శుక్రవారం “శ్రీరామ హృదయం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బిటుకూరి గోపాల ఆచార్యులు నగర సంకీర్తన నిర్వహించి అనంతరం ప్రత్యేక పూజలు, ఆర్చనలు చేశారు. కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని శ్రీరామనామ సంకీర్తనలో పాల్గొన్నారు.
అపర రామానుజులు, పద్మభూషణులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్ర మహోత్సవం నవంబర్ 8న దీపావళి రోజున జరగనున్న నేపథ్యంలో లోకక్షేమార్థం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించాలని పెద్దలు నిర్ణయించినట్లు తెలిపారు.
అందులో భాగంగా “సత్సంగము” కార్యక్రమాన్ని 29-07-2026 నుంచి 26-10-2026 వరకు 90 రోజులపాటు ఇంటింటా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ఆచార్యుల శ్రీసూక్తి వినడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
“శ్రీరామ హృదయం” కార్యక్రమం ద్వారా యాంత్రిక జీవితంలో మానవీయ విలువలు, ప్రేమ, ఆప్యాయత, సఖ్యత, గౌరవం, స్నేహభావం కుటుంబాల్లోనూ సమాజంలోనూ పెంపొందాలని నిర్వాహకులు పేర్కొన్నారు. శ్రీరామచంద్రుడిని హృదయంలో నిలుపుకొని, ఆయన ఆదర్శాలను ఆచరించాలనే సందేశాన్ని భక్తులకు అందించారు.
ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి సభ్యులు, గోదా గోష్టి మహిళలు, భక్తులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
ఘనంగా ‘శ్రీరామ హృదయం’ నగర సంకీర్తన
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **