ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 04 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గోపి రమణ, సాన లత, లకు చెందిన శిధిలావస్థలో ఉన్న ఇండ్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం పరిశీలించి వారికి ప్రభుత్వ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు,
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు సూడిద రాజేందర్
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి. సర్పంచ్ బాపురెడ్డి. మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి. గుర్రాల రాజిరెడ్డి పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు. పందిర్ల శ్రీనివాస్.గౌడ్ బింగి మల్లేశం యాదవ్ . తదితరులు పాల్గొన్నారు,
వర్షానికి శిథిలవస్థకు చేరుకున్న ఇళ్లను పరిశీలించిన నాయకులు
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి సాన లలిత నివాసం తీవ్రంగా దెబ్బతింది. ఇంటి గోడలు ఊరుస్తుండగా, మట్టి పెచ్చులు కింద పడిపోవడంతో ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది.
ఈ విషయం తెలుసుకున్న జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఆర్ఐ సాహితి కార్యదర్శి కృష్ణహరి, వార్డు సభ్యురాలు జవాజి వరలక్ష్మి కలిసి మంగళవారం ఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా సాన లలిత మాట్లాడుతూ, తన తల్లి వృద్ధాప్యంలో ఉన్నారని, ప్రస్తుతం ఇంటి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిందని తెలిపారు. ప్రభుత్వం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.