నేటి ప్రభాతదర్శిని సిరిసిల్ల, ఆగస్టు 03 విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్టోర్ రూమ్ లో బియ్యం, పప్పులు, గుడ్లు ఇతర నిలువ పదార్థాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు.
తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడాడు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం భోజనం పెడుతున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. సైన్స్ పాఠ్యాంశానికి సంబంధించిన పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతి సబ్జెక్టులోని అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రణాళిక ప్రకారం చదివితే భవిష్యత్తు లో ఎంతో మేలు చేస్తుందని వివరించారు. విరామ సమయంలో విద్యార్థులు ఆటలు ఆడాలని సూచించారు.
TELANGANA RAJANNA SIRCILLA
విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలి ప్రతి పాఠ్యాంశంపై పట్టు సాధించాలి విరామ సమయంలో ఆటలు ఆడాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **