రాజన్న సిరిసిల్ల, ఆగస్టు – 03 సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నామని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి.. ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. మొత్తం 196 అర్జీలు రాగా, సంబంధిత అధికారులకు అందజేసి.. పరిష్కరించాలని ఆదేశించారు.
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తోపాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రజలు తమ అర్జీలు అందించాలని సూచించారు. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 5 దరఖాస్తులు రాగా, సంబంధిత అధికారులకు అందజేసి.. పరిష్కరించాలని ఆదేశించారు. వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 4 దరఖాస్తులు రాగా, సంబంధిత అధికారులకు అందజేసి.. పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.