నే టి ప్రభాతదర్శిని ఆగస్టు 03 : - అంగన్ వాడి పిల్లలకు పలకలు
ఇల్లంతకుంట మండలం రేపాక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ అధ్యక్షులు రొండ్ల ప్రభాకర్ రెడ్డి టీషర్ట్స్, టాయ్, బెల్టులు అందజేశారు. సర్పంచ్ కాత మల్లేశం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ అదుక్షులు రొండ్ల ప్రభాకర్ రెడ్డి తన మనుమరాలు రెడ్డమ్మగారి ఇషాని జన్మ దినం సందర్బంగా 24 మంది విద్యార్థులకు టీషర్ట్స్, టాయ్ బెల్టులు మరియు పెన్నులు, పెన్సిల్లు ఇదే పాఠశాలలో ఉన్న 10 మంది అంగన్వాడీ పిల్లలకు పలకలను ఆయన అందేశారు.ఈ సందర్బంగా రొండ్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటాలని, తమ పుట్టినరోజు వంటి సందర్భాలకు కచ్చితంగా ప్రతి ఒకరు ఒక మొక్క నాటాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాతావరణ కాలుష్య రహిత సమాజానికి పాటు పడాలాన్నారు.ఇటీవల రేపాక గ్రామంలో ఉచిత కంటి పరీక్ష శిభిరాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని, తాళ్ళల్లపల్లె ప్రాథమిక పాఠశాలలోb విద్యార్థులకు టీషర్ట్స్ మరియు టాయ్ బెల్టులు, అందజేయడం జరిగిందన్నారు. ఉచిత ఆరోగ్య శిభిరాలు నిర్వహించి బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.నేను పుట్టిన గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని,రాబోవు రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు రేపాకలో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అనంతరం గ్రామ సర్పంచ్ కాత మల్లేశం మాట్లాడుతూ పుట్టి పెరిగిన స్వంత గ్రామంలో రొండ్ల ప్రభాకర్ రెడ్డి సేవా మరియు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, సర్పంచ్ గా నా సహకారం ఎప్పటికి ఉంటుందన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రం ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ అధ్యక్షులు రొండ్ల ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ కాత మల్లేశంతో కలిసి పూల బంతులను చల్లి, మొక్కలు నాటారు.అక్కడికి వచ్చిన గ్రామస్తులకు బిపి , షుగర్ పరీక్షలు నిర్వహించి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ తరపున ఉచితంగా మందులు అందజేశారు.ఈ సందర్బంగా విద్యార్థులందరికి బిస్కిట్ ప్యాకెట్లు, చాక్లెట్లను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయితీ కార్యదర్శి ప్రవీణ్, ఉప సర్పంచ్ కోదాని మహేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్యదర్శి కె. సదానందరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ సభ్యులు కె. నారాయణ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు యం. స్రవంతి, రొండ్ల రాంరెడ్డి, రొండ్ల మల్లా రెడ్డి, కొంకటి ఆంజనేయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
విద్యార్థులకు టీ షర్ట్స్, టాయ్ , బెల్టులు అందజేత - 24 మంది విద్యార్థులకు టీ షర్ట్స్, టాయ్, బెల్టులు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **