నె టి ప్రభాతదర్శిని ఎల్లారెడ్డిపేట ఆగస్టు 03 :
ప్రభుత్వ నిధులతో బాగు చేయించవలసిన గుంతలు పడి అధ్వానంగా మారిన రోడ్డును ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామ సర్పంచ్ మాదాసు స్రవంతి బాబు ఏకంగా సొంత ఖర్చులతో గుంతలు పూడ్చి వేయించి ఆదర్శంగా నిలిచారు,
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి గర్జనపల్లి మరిమడ్ల వరకు డబల్ రోడ్డు నిర్మించిన ఏ వన్ కాంట్రాక్టర్ దుమాల రా పెళ్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణం పనులను సబ్ కాంట్రాక్టర్ కు అప్పగించారు
సబ్ కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణం పనులను ఎట్టకేలకు పూర్తి చేసినప్పటికీ బ్రిడ్జికి ఇరువైపులా 100 మీటర్ల పొడవు మట్టి రోడ్డు
గుంతలు పడి అధ్వానంగా మారి ఈ బిడ్జి గుండా మండల కేంద్రం నుండి దుమాల అక్కపల్లి వీర్నపల్లి కొనరావు పేట మండలాలకు వెళ్లే ప్రయాణికులు వివిధ వాహనదారులు సర్కస్ ఫైట్స్ చేస్తూ ఇబ్బందుల పాలయ్యారు, గర్భవతులు వృద్ధులు నరకాన్ని అనుభవించారు, ఓరి దేవుడా,,,,ఈ ప్రాంతంలో తాము పుట్టడమే పాపమా,,,,, ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకుపోగా అక్కపల్లి గ్రామ సర్పంచ్ మాదాసు స్రవంతి బాబు ముందుకు వచ్చి తమ సొంత ఖర్చులతో గుంతలు పడి ఆధ్వన్నంగా మారిన రోడ్డును ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో పూడ్చి వేయించి తన ఔదార్యాన్ని చాటుకుంది. బ్రిడ్జికి రెండువైపులా గుంతలు పడ్డ రోడ్డును మట్టితో పూడ్చివేయించారు. గత ఏడాది కూడా ఇదే విధంగా తన సొంత ఖర్చులతో పూడ్చి వేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్, మాజీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, అక్కపల్లి మాజీ సర్పంచ్ మందాటి దేవేందర్ యాదవ్ , జిల్లా నాయకులు ఎస్కే గౌస్, సాహెబ్ బండారి బాల్ రెడ్డి, జంకె లచ్చిరెడ్డి గంట బుచ్చాగౌడు, జంకె జనార్దన్ రెడ్డి షకీల్ సిరిసిల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
గుంతలు పడి అధ్వానంగా మారిన రోడ్డును పూడ్చివేయిస్తున్న సర్పంచ్ సొంత ఖర్చులతో సర్పంచ్ మాదాసు స్రవంతి బాబు ఔదర్యం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **