తేదీ: 01/08/2026వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్
ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆoజెల ఆల్ఫ్రెడ్ వేములవాడ పట్టణంలోని పలు ఆసుపత్రులను. డయాగ్నస్టిక్ స్కానింగ్ సెంటర్ లను తనిఖీ చేయడం జరిగింది. ఇందులో హాస్పిటల్ లో వారు అంధించే సేవలకు తీసుకునే రుసుముల పట్టికను అందరికీ తెలిసే విదముగా ప్రదర్శించాలని అంతేకాకుండా ఆసుపత్రి పరిసరాలు పరిశుబ్రముగా వుండాలని , ప్రతి ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు, యాజమాన్యాలు విధిగా దరల పట్టికను ప్రదర్శించాలని, బయో మెడికల్ వేస్ట్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్ లు, ఆసుపత్రి లో పనిచేసే డాక్టర్లు పేర్లను బోర్డు పైన ప్రదర్శించాలని, సిబ్బంది కి సంభందిచ్చిన సర్టిఫికట్ లను విధిగా తనికి అధికారులకు చూపించాలని ఫైర్ సేఫ్టీ మెసర్స్ కు సంభందించిన పరికరాలను అమర్చుకోవాలని ఆయన పేరుకొన్నారు.
స్కానింగ్ సెంటర్లలో గర్భిణులకు సేవలు అందించే సమయంలో PCPNDT చట్టం నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం పూర్తిగా చట్టవిరుద్ధమని హెచ్చరించారు. సంబంధిత రికార్డులు పూర్తిస్థాయిలో నిర్వహించాలని, నిబంధనల ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
స్కానింగ్ సెంటర్లలలో లింగ నిర్ధారణ పరీక్షలు అనుమతి పొందిన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్ట్లు మాత్రమే గర్భవతులకు స్కానింగ్ చేయాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత ఆడ మగ అని తెలుపుట చట్టరీత్యా నేరమని పెరుకొంటూ, అన్ని స్కానింగ్ సెంటర్లలో స్కానింగ్ చేసే గదిలో మరియు వేచియుండు హాలులో తప్పకుండా ఇక్కడ లింగ నిర్ధారణ చెప్పబడదు అనే బోర్డు పెట్టాల్సిందిగా ఆదేశించారు, ఫామ్ -F ఏరోజువి ఆ రోజే ఆన్లైన్ చేయాలని, ఆన్లైన్ చేసిన అన్ని ఫారం-F లు అన్నీ ప్రతినెల 5వ తారీఖు లోపు జిల్లా వైద్య' ఆరోగ్య శాఖా కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు.
రెండు డయాగ్నస్టిక్ సెంటర్ లు అనుమతులు లేకుండా నడుపుతున్న వాటిని గుర్తించి వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది.
ఇట్టి తనికీ ల కార్యక్రమంలో సెక్షన్ ఇంచార్జ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖధికారి రాజన్న సిరిసిల్ల జిల్లా
జిల్లా పౌర సంబందాల శాఖాధికారి గారి ద్వారా అన్ని పత్రికలలో ప్రచురణ నిమిత్తం సమర్పించనైనది.