• Other News
  • Live TV
  • *ప్రస్తుత వర్షాలు ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలం – వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులు దృష్టి సారించాలి

    Reporter
    admin July 31, 2026, 3:18 pm
    *ప్రస్తుత వర్షాలు ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలం – వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులు దృష్టి సారించాలి

    ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న వర్షాలు, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఆయిల్‌పామ్‌ మొక్కల నాటడానికి, కొత్త తోటల స్థాపనకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ తెలిపారు. రైతులు ఈ అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ సాగును చేపట్టాలని సూచించారు.

    ప్రస్తుతం సరిపడా వర్షపాతం నమోదవుతుండటంతో భూమిలో తేమ సమృద్ధిగా ఉండి, కొత్తగా నాటిన ఆయిల్‌పామ్‌ మొక్కలు వేగంగా స్థిరపడేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. అయితే రానున్న కాలంలో వర్షాభావ పరిస్థితులు లేదా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు

    ఆయిల్‌పామ్‌ – ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంట

    ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, భవిష్యత్‌లో ఏర్పడే ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటగా నిలుస్తుందని తెలిపారు.

    వరి సాగుతో పోలిస్తే ఆయిల్‌పామ్‌కు నీటి వినియోగం సమర్థవంతంగా ఉండటంతో పాటు, డ్రిప్‌ ఇరిగేషన్‌, మల్చింగ్‌ వంటి పద్ధతులను అవలంబించడం ద్వారా నీటిని పొదుపుగా వినియోగించుకోవచ్చని వివరించారు. ఒకసారి తోట స్థిరపడిన తర్వాత దీర్ఘకాలం పాటు దిగుబడులు పొందే అవకాశం ఉండటం ఆయిల్‌పామ్‌ సాగు ప్రత్యేకత అని తెలిపారు.

    4వ సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా ఆదాయం

    ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టిన రైతులు మొదటి సంవత్సరాల్లో తోట అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉన్నప్పటికీ, 4వ సంవత్సరానికి తోటలు పూర్తిగా అభివృద్ధి చెంది గెలల కోత ప్రారంభమవుతుంది. అనంతరం క్రమం తప్పకుండా గెలల కోత జరుగుతూ రైతులకు ప్రతి నెలా ఆదాయం లభించే అవకాశం ఉంటుంది.

    ఇతర సాంప్రదాయ పంటల మాదిరిగా ఒకేసారి మాత్రమే ఆదాయం కాకుండా, ఆయిల్‌పామ్‌లో క్రమం తప్పకుండా గెలల కోత ద్వారా నిరంతర ఆదాయాన్ని పొందే అవకాశం ఉండటం ఈ పంట యొక్క ప్రధాన ప్రత్యేకత అని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ తెలిపారు.

    అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం

    ఆయిల్‌పామ్‌ తోటలు పూర్తిగా అభివృద్ధి చెందే వరకు మొదటి మూడు సంవత్సరాల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని అనువైన అంతర పంటలను సాగు చేసుకోవచ్చని తెలిపారు.

    కూరగాయలు, పప్పుధాన్యాలు మరియు స్థానిక వాతావరణానికి, నీటి లభ్యతకు అనుగుణమైన స్వల్పకాలిక పంటలను అంతర పంటలుగా సాగు చేయడం ద్వారా ఆయిల్‌పామ్‌ తోటతో పాటు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు.

    దీంతో ఆయిల్‌పామ్‌ తోట పూర్తిగా దిగుబడికి వచ్చే వరకు కూడా రైతులకు అదనపు ఆదాయ వనరు కొనసాగుతుందని తెలిపారు.

    కొత్తగా ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టే రైతులకు ఎకరాకు రూ.50,000 వరకు సబ్సిడీ

    ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ ద్వారా అర్హత కలిగిన కొత్త రైతులకు ఎకరాకు రూ.50,000 వరకు వివిధ రూపాల్లో సబ్సిడీ అందిస్తున్నట్లు జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ తెలిపారు.

    ఈ సహాయంలో ఆయిల్‌పామ్‌ మొక్కలు, డ్రిప్‌ ఇరిగేషన్‌, అంతర పంటలు మరియు తోట నిర్వహణకు సంబంధించిన సబ్సిడీలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణాన్ని పెంచుకోవాలని సూచించారు.

    వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌

    ప్రస్తుతం నీటి లభ్యత, భవిష్యత్‌లో వర్షాభావ పరిస్థితుల అవకాశం, సాగు ఖర్చులు, రైతులకు లభించే దీర్ఘకాలిక ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలని గడ్డం శ్యామ్ ప్రసాద్ సూచించారు.

    ప్రత్యేకించి నీటి లభ్యత పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరి వంటి నీటి అవసరం అధికంగా ఉన్న పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ను సాగు చేయడం ద్వారా నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని తెలిపారు.

    ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుని భూమిలో తేమ ఉన్నప్పుడే ఆయిల్‌పామ్‌ తోటల స్థాపనకు రైతులు ముందుకు రావాలని, భవిష్యత్‌లో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ రైతులకు విజ్ఞప్తి చేశారు.

    రైతులు ఆయిల్‌పామ్‌ సాగుకు సంబంధించిన సాంకేతిక సమాచారం, మొక్కల లభ్యత, సబ్సిడీలు, డ్రిప్‌ మరియు అంతర పంటల వివరాల కోసం సమీపంలోని ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.

    – గడ్డం శ్యామ్ ప్రసాద్
    జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల అధికారి
    పెద్దపల్లి జిల్లా

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/