• Other News
  • Live TV
  • ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే త్రాగించాలి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జి.ఎంజేలాఅల్ఫ్రేడ్.

    Reporter
    admin July 31, 2026, 2:35 pm
     ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే త్రాగించాలి  జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి  డాక్టర్  జి.ఎంజేలాఅల్ఫ్రేడ్.

    ఆగష్టు 1 నుండి 7 వ తేదీ వరకు తల్లి పాల వారోత్సవాల ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ తల్లి పాల ప్రాముఖ్యతను గుర్తించి మొదటి 6 నెలలు తల్లి పాలను మాత్రమే తాగిoచాలని, కాన్పు అయిన మొదటి కొద్ది రోజులు తల్లిపాలు చిక్కగా, పసుపు రంగులో ఉంటాయని, దీనిని ముర్రుపాలు లేదా కొలెస్ట్రాo అంటారని ఇందులో ప్రోటీన్లు, రోగాలను ఎదుర్కొనే శక్తిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుందని. వీటికి తోడుగా విటమిన్ ఎ,బి లతో పాటు తగినంత ఐరన్ కూడా ఉంటుందని, ముర్రుపాలు బిడ్డకు సంజీవని వంటివని, ఇవి అమృతంతో సమానమని ఆమె పేరుకొన్నారు.
    ముర్రుపాలతో శిశువులు చక్కగా పెరుగుతారని అప్పుడే పుట్టిన బిడ్డ ప్రేగులకు జీర్ణశక్తిని బాగా ఉంచడంలో తోడ్పడతాయని అంతేకాక, కామెర్లు, విరేచనాల వంటి ప్రమాదకరమైన రోగాల నుండి కాపాడతాయని తెలిపారు.
    6 నెలలదాకా తల్లిపాలివ్వటం అత్యంత ప్రయోజనకరం

    1. తల్లిపాలు బిడ్డకు అత్యంత సహజమైన, సురక్షితమైన పుష్టికరమైన ఆహారం, సీసా పాలు త్రాగే పిల్లల కన్నా తల్లిపాలు త్రాగే పిల్లలు ఎక్కువ బలంగా తెలివిగా వుంటారు వారికి రోగాలను ఎదుర్కునే శక్తి ఎక్కువగా వుంటుంది.
    2. తల్లి పాలు తేలికగా అరుగుతాయి. ఇవి శుబ్రంగా, ఎటువంటి క్రిములు లేకుండా వుంటాయి.
    3. తల్లిపాలు పిల్లలను శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు, ఆస్తమా, చర్మవ్యాధుల నుండి రక్షిస్తాయి.

    4. తల్లిపాలు త్రాగే బిడ్డ యొక్క దవడలు బాగా బలపడతాయి.

    5. బిడ్డకు పాలు త్రాగించే తల్లికి మనసులో తృప్తితో బాటు, నెలసరిలో రక్తస్రావం కూడా తక్కువగా ఉంటుంది. పాలిచ్చినంత కాలం గర్భం రాకుండా గర్భ నిరోధకంగా కూడా పని చేస్తుంది.

    6. కేవలం తల్లిపాలే బిడ్డ యొక్క మానసిక మరియు శారీరక వికాసానికి అవసరమైన పోషణ ఇస్తాయి.

    వగలూ, రాత్రీ కలిపి బిడ్డకు కనీసం 8-10 సార్లు పాలివ్వాలి.
    పుట్టిన దగ్గర నుండి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని పై ఆహారం వద్దు అని
    7 నుండి 8 నెలల వయస్సు లో తల్లిపాల తో పాటు 3 సార్లు పై ఆహారం ఇవ్వాలని,
    9 నుండి 11 నెలలు, తల్లిపాల తో పాటు 4 సార్లుపై ఆహారం ఇవ్వాలని తెలిపారు.
    బిడ్డ పుట్టిన గంటలోగా తల్లిపాలు త్రాగించాలి దీనివల్ల పాలు బాగా పడి బిడ్డకు సమృద్ధిగా పాలు లభిస్తాయి.

    కాన్పుకాగానే వచ్చే మొదటి చిక్కని, పసుపు రంగులో ఉండే ముర్రుపాలు బిడ్డకు తప్పక త్రాగించాలి. సంపూర్ణ పోషకవిలువలతో కూడిన ఈ ముర్రుపాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
    తల్లికి లేదా బిడ్డకూ ఒకవేళ ఒంట్లో బాగా లేకపోయిన' బిడ్డకు పాలివ్వడం మానవద్దు బిడ్డకు ఒకవేళ విరేచనాలు అవుతున్నా తప్పకుండా తల్లిపాలే ఇవ్వాలి.
    తల్లి ఎప్పుడూ తగినంత సంతులిత ఆహారం తీసుకుంటూ ఉండాలి.
    పంచదార నీళ్ళు తేనె, ఆవుపాలు లేదా మేకపాలు,వస, గోమూత్రం బిడ్డకు పట్టవద్దు.

    6 నెలలు పూర్తయ్యే వరకూ బిడ్డను తల్లి పాలు తప్ప మరి ఏ ఇతర పదార్థాలు ఇవ్వవద్ద ని బిడ్డకు ఏ రుతువులోనైనా మంచినీరు పట్టనక్కర లేదని
    సీసా పాలు కూడా ఇవ్వవద్దని పేర్కొన్నారు.

    బిడ్డకు పాలిచ్చే సరైన విదానం

    బిడ్డ తల శరీరం అడ్డంగా ఉండేలా పట్టుకోవాలి.

    బిడ్డ తల స్తనం వైపుకి, ముక్కు చనుమొన వైపుకి ఉండాలి.

    బిడ్డ శరీరం పూర్తిగా తల్లి ఒడిలో ఉంచినందువల్ల బిడ్డకు చక్కటి ఆసరా లభిస్తుంది. దీని వల్ల తల్లి మరియు బిడ్డకు చక్కని అనుబంధం ఏర్పడుతుంది, బిడ్డకు వెచ్చదనం లభిస్తుంది.

    బిడ్డ నోరు తెరవగానే చనుమోనను బిడ్డ నోటికి అందించాలి. బిడ్డ యొక్క క్రింది పెదవి, చనుమొన పూర్తిగా
    బిడ్డ నోటిలోకి వెళ్ళాలి.

    బిడ్డకు రెండు స్తనాల నుంచి పాలు త్రాగించాలి ఒక స్తనంలో పాలు బిడ్డ పూర్తిగా త్రాగటానికి దాదాపు 20 నిముషాలు పడుతుంది.
    6. బిడ్డకు పాలివ్వాలని తల్లికి స్వయంగానే స్తనాలు నిండినట్లు ఉండటం ద్వారా తెలుస్తుంది. అందువల్ల, పాలిచ్చిన ప్రతిసారి, తల్లికి మనసులో తృప్తిగా ఉంటుంది. ఇది మరింత పాల ఉత్పత్తికి దోహదపడుతుందని ఆమె తెలిపారు.

    జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి రాజన్న సిరిసిల్ల

    జిల్లా పౌర సంబందాల శాఖాధికారి గారి ద్వారా అన్ని పత్రికలలో ప్రచురణ నిమిత్తం సమర్పించనైనది.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/