ఈరోజు హైదరాబాదులోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు.
పాల్వంచ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షునిగా బండ రమేశ్వర్పల్లి సర్పంచ్ నాగరాజు గారిని సర్పంచులందరు ఏనుకోవడం జరిగింది.
అలాగే సర్పంచులు గ్రామాల సమస్యలను షబ్బీర్ అలీ గారి దృష్టికి తీసుకురగా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వాడి సర్పంచ్ నర్సారెడ్డి, పాల్వంచ సర్పంచ్జ్ శేఖర్, సింగారయిపల్లి సర్పంచ్ లత అంజయ్య, ఇస్సాయిపేట సర్పంచ్ లలిత నర్సింలు, ఆరెపల్లి సర్పంచ్ జ్యోతి భూమయ్య, మంథని దేవునిపల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, భవానీపేట తాండ సర్పంచ్ తిరుపతి నాయక్ పాల్గొన్నారు.