ఎల్లారెడ్డి పేట జూలై 28 :
వరికి బదులుగా రైతులు ఇతర పంటలు సాగు చేయాలని
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు.
రైతు నేస్తం 100వ ఎపిసోడ్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ నుంచి, మంగళవారం మంత్రి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల్లోని మండలాల రైతు వేదికల ద్వారా అధికారులు, రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, వేములవాడ అర్బన్ మండలం మారుపాక రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, వ్యవసాయాన్ని సులభంగా, లాభసాటిగా మార్చేందుకు సాంకేతికతను వ్యవసాయ రంగానికి జోడించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. ఉద్యానవన పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.
ఆయిల్ పామ్ పంటల సాగు వల్ల అధిక లాభాలు వస్తాయని వివరించారు. నేల స్వభావం, నీటి లభ్యత, దిగుబడి, మార్కెటింగ్ సౌకర్యం, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటలు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి రైతు పంట మార్పిడి విధానాలు పాటించాలని పేర్కొన్నారు. మోతాదుకు మించి ఎరువులను వాడరాదని తెలిపారు.
రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రపంచ సమాచారాన్ని మొత్తం రైతు ముంగిట్లో అందుబాటులో పెడుతున్నామని తెలిపారు. మున్ముందు రైతులు పెద్ద సంఖ్యలో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతుల్లో పంటలకు సంబంధించి అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మండల స్థాయి వ్యవసాయ అధికారులంతా తప్పనిసరి ప్రతిరోజు రైతుల మధ్య ఉండాలని స్పష్టం చేశారు.
మంత్రితో నేరుగా, మండలాల నుంచి రైతువేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన పలువురు రైతులు మాట్లాడుతూ, వారు అవలంబించిన పంట మార్పిడి విధానాలు, పొందిన లబ్ధి వివరాలు పంచుకున్నారు.
పలువురు ఆదర్శ రైతులను మంత్రి సన్మానించారు.
ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలువురు ఆదర్శ రైతులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సన్మానించారు. వారు ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారో ఆరా తీశారు.
అనంతరం మారుపాక రైతు వేదికలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ..
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, భూగర్భ జలాలు తగ్గుతున్నాయని వెల్లడించారు.
జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 36 శాతం వర్షపాతం తక్కువగా నమోదు అయిందని తెలిపారు.
వేములవాడ అర్బన్ మండలంలో 20 మీటర్ల లోతులోకి వెళ్ళాయని పేర్కొన్నారు.
జిల్లాలోని ఎగువ మానేరు, శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు), మల్కపేట, అన్నపూర్ణ రిజర్వాయర్లలో ఉన్న నీరు తాగునీటికి సరిపోతుందని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దని సూచించారు. మార్కెట్ డిమాండ్, నేలకు అనుకూలమైన పంటలు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు. ఆయిల్ పామ్ సాగు చేస్తే మూడు ఏండ్ల తర్వాత దిగుబడి వస్తుందని వివరించారు. అలాగే రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు, నువ్వులు, మొక్కజొన్న పంటలు ఇప్పటికీ వేయవచ్చని వెల్లడించారు. రైతులకు కావలసిన విత్తనాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ జలసిరి కింద బోర్ వెల్స్ రీచార్జ్ పనులు, పామ్ పాండ్స్ నిర్మాణాలు, ఇతర జల సంరక్షణ పనులు ముమ్మరంగా చేయించాలని ఆదేశించారు. ప్రతి వర్షం నీటి బొట్టును ఒడిసి పట్టాలని పిలుపు నిచ్చారు. ఇప్పుడు వర్షాకాలంలో నీటిని కాపాడితే రానున్న రబీ సీజన్లో ఇబ్బందులు రావని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. తినకముందు తిన్న తర్వాత చేతులు కడుక్కోవాలని తెలిపారు. అందరూ వేడి చేసి చల్లారిన తర్వాత నీటిని తాగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
కార్యక్రమంలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వేములవాడ డివిజన్ ఆత్మ కమిటీ అధ్యక్షుడు ముస్కు ముకుందరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సాయి కుమార్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ జయంత్ కుమార్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, సర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
రైతు నేస్తం కార్యక్రమంతో రైతాంగానికి వ్యవసాయ విషయాలపై స్పష్టమైన అవగాహన
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **