జులై 23
జనగాం భూముల రీ సర్వేతో భూ సమస్యలు ఇక చెల్లు అవుతాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు
జనగాం మండలం మరిగడి గ్రామం లో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు
ఈ సందర్బంగా కలెక్టర్ ...ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు చేసారు... ఇంకా ఎంత చేయాలి అని రెవెన్యూ, ల్యాండ్ అండ్ సర్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు
భూ సమస్య లకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యం తోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వె ప్రక్రియను ప్రారంభించింది అన్నారు
గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా భూముల రీసర్వే ప్రక్రియ గడువు లోగ జరగాలని అధికారులకు తెలిపారు
అనంతరం పంటల గురించి కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ.... వర్షభావ ప్రభావం వల్ల... పంటలు వేసే ముందు అలోచించి వేయాలన్నారు.
వరి పంట మీదనే ఆధార పడకూడదన్నారు
ఎ పంటలు వేయాలో అవగాహన కోసం అధికారులని సంప్రదించాలన్నారు
కోతుల సమస్య లేకుండా ఉండాలంటే కంది లాంటి పంటలను వేయాలన్నారు
ఈ కార్యక్రమం లో ఆర్డీఓ గోపీరామ్, తహసీల్దార్,ల్యాండ్ అండ్ సర్వే AD తదితరులు పాల్గొన్నారు