నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి నిజామాబాద్ జూలై 22
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా బుధవారం రోజు నిజామాబాదు నగరంలోని 11వ డివిజన్ లో డిసిసి కార్పొరేషన్ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ సమన్వయంతో అంబేద్కర్ చిత్రపటం వద్ద ట్రాన్స్ జెండర్ లు జరీనా, గంగా ఇతర ట్రాన్స్ జెండర్ల అందరితో కలసి డిసిసి నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసనకార్యక్రమం చేపట్టడం జరిగింది, ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం సాక్షిగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలపై కేంద్ర ప్రభుత్వ పోలీసులు సోమవారం రోజు దిల్లీలో జరిపిన పాశవిక దాడిని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బొబ్బిలి రామకృష్ణ మీడియాకు తెలిపారు, ఇంకా ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యతగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సింది పోయి, జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థుల పైననే పోలీసులు లాఠీలతో పాషవిక దాడి చేయడం అత్యంత దురదృష్టకరమని బొబ్బిలి రామకృష్ణ కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా ఈ యొక్క నిరసన కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు తమ చేతులకు సంకెళ్లు వేసుకుని తమ నిరసనను తెలిపారు, ఇంకా ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ, న్యాయం జవాబుదారితనం కోసం సాగే విద్యార్థులు చేస్తున్న ఈ యొక్క ప్రజాస్వామ్య పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని, దేశవ్యాప్తంగా ఉన్న యావత్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తున్న యువతకు గట్టిగా అండగా నిలుస్తుందని బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు, ఇదే సందర్భంలో బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అణిచివేత ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులను జైల్లో పెట్టవచ్చు అని కానీ న్యాయం జవాబుదారి తనం కోసం పోరాడుతున్న లక్షలాదిమంది యువ భారతీయుల ఆగ్రహాన్ని ప్రభుత్వం అణిచివేయలేదని రామకృష్ణ మీడియాకు తెలిపారు.
ఇంకా ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ కార్పొరేటర్లు కరీం అన్వర్ నయీమ్ నవాజ్ ఆవిన్ తదితరులు పాల్గొన్నారు.
TELANGANA NIZAMABAD
రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలు-బొబ్బిలి రామకృష్ణ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **