*కార్గిల్ లేక్ సుందరీకరణ పనులు గడువులోగా పూర్తి చేయాలి*
*అమృత్ 2.0 కింద రూ. 1 కోటి 32 లక్షలతో పనులు*
*కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్*
*సిరిసిల్ల పట్టణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి*
*హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే*
----------------------------------
రాజన్న సిరిసిల్ల, జూలై -17
---------------------------------
అమృత్ 2.0 కింద సిరిసిల్ల పట్టణంలోని కార్గిల్ లేక్ బండ్ సుందరీకరణ పనులు గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశించారు.
అమృత్ 2.0 స్కీం కింద రూ.కోటి 32 లక్షలతో సిరిసిల్ల పట్టణంలోని కార్గిల్ లేక్ చెరువు పునరుద్దరణ, సుందరీకరణ పనులకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. లేక్ పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించారు. కార్గిల్ యుద్దంలో వీర మరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ..కార్గిల్ లేక్ చెరువు పునరుద్దరణ, సుందరీకరణ పనులను కాంట్రాక్టర్ నిర్ణిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.
లేక్ లోకి మురుగునీరు రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. లేక్ సుందరీకరణతో సిరిసిల్ల పట్టణంతోపాటు జిల్లా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని వివరించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, డీఎస్పీ నాగేంద్రచారి, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.