తేది 27-05-2026. ఈ రోజున ఐ టి ఐ కళాశాల లో ' ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం ' పురస్కరించుకొని , పొగాకు ఉత్పత్తులు వినియోగము మరియు పొగ పీల్చడం వల్ల కలిగే దుష్ప్రభావాలు గురించి అవగాహన కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ గారి ఆదేశము లతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డా.రాజమౌళి ప్రోగ్రాం అధికారి ( ఎన్ సి డి), గారు మాట్లాడుతూ, పొగాకు ఉత్పత్తులు వినియోగము మరియు పొగ పీల్చడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధించిన మరియు ఊపిర్తితుల వ్యాధులు వస్తాయి.ఇది ఒక ప్రధాన ప్రమాద కారకంగా ఉందని విన్నవించడమైనది.
పొగాకు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించడానికి మరియు పొగాకు నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి, ప్రతి సంవత్సరం మే 31వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2026 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం యొక్క ఇతివృత్తం " ఆకర్షణను బహిర్గతం చేయడం: నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం."
COTPA (కోప్ట ) చట్టం, 2003 కింద అమలు చర్యలో భాగముగా, బహిరంగ ప్రదేశాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విద్యా సంస్థలు మొదలగు ప్రదేశాల్లో పొగ తాగితే 200/- నుండి 10000/- వరకు జరిమానా వేయబడును.కావున యువత పొగకు వినియోగానికి మరియు పీల్చడానికి దూరంగా ఉండాలని చెప్పినారు.ఈ కార్యక్రమంలో రవీంద్రారెడ్డి, ప్రినిపాల్ గారు, సిబ్బంది మధుసూదన్, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
పెద్దపల్లి