మే 18 జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటి - బుగ్గారం కు పక్కా భవన నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, నిర్మాణ అనుమతులు కూడా జారీ చేయాలని సోమవారం జరిగిన అత్యవసర పాలక వర్గం సమావేశంలో విడిసి విజ్ఞాపన పత్రాలు అందజేసింది.
గ్రామ నడి బొడ్డున నిర్మాణ దశలో ఉన్న ఎంపిపి కార్యాలయం ప్రక్కన ప్రస్తుత పోలీస్ స్టేషన్ పార్కింగ్ స్థలంలో గ్రామ అభివృద్ధి కమిటి కి పక్కా భవనం నిర్మించేందుకు స్థలం కేటాయించాలని వారు కోరారు. విడిసి వ్యవస్థాపక అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్ లు గ్రామ సర్పంచ్ నక్క రాజవ్వ, పంచాయతీ కార్యదర్శి అక్బర్ లతో పాటు ఉప సర్పంచ్ జంగ లావణ్య, వార్డ్ సభ్యులకు వారు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఈ నాటి పాలక వర్గం సమావేశంలో తీర్మాణం చేసి, గ్రామ సభలో కూడా తీర్మాణం చేసి తీర్మానాల ప్రతులతో పాటు భవన నిర్మాణ అనుమతులు కూడా జారీ చేయాలని వారు కోరారు.
TELANGANA JAGTIAL
విడిసి భవనానికి భూమి కేటాయించండి నిర్మాణ అనుమతులు కూడా జారీ చేయండి
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **