• Other News
  • Live TV
  • రైతులు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల సేవలు వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    Reporter
    admin May 4, 2026, 3:00 pm
    రైతులు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల సేవలు వినియోగించుకోవాలి  జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    తంగళ్లపల్లి, మే - 04 ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాల సందర్భంగా నేలల సంరక్షణ.. ఎరువుల యాజమాన్యం.. ప్రకృతి వ్యవసాయం, సన్న వడ్లు, ఆయిల్ పామ్ సాగు పై అవగాహన కార్యక్రమం
    సాగులో నేలల సంరక్షణ.. ఎరువుల వినియోగం కీలకమని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

    ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాల సందర్భంగా నేలల సంరక్షణ.. ఎరువుల యాజమాన్యం.. ప్రకృతి వ్యవసాయం, సన్న వడ్లు, ఆయిల్ పామ్ సాగు పై

    తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామంలోని రైతు వేదికలో సోమవారం వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖ ఆద్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

    ముందుగా జయ జయహే తెలంగాణ పాటను వినిపించారు. నేలల సంరక్షణ పై ప్రతిజ్ఞ చేశారు. సన్న వడ్లు, ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు సాగులో యాజమాన్య పద్ధతులు, ఎరువుల వినియోగం, దిగుబడి, సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వ బోనస్ తదితర అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతులను సన్మానించారు.

    జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు  ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించామని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు. అరైవ్.. అలైవ్ కింద వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు, నిబంధనలపై అవగాహన కల్పించామని తెలిపారు. డ్రైవర్లకు వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు చేయించామని పేర్కొన్నారు.

    మూడేండ్ల వయసు, అలాగే ఆరేండ్లలోపు పిల్లలు తమ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు కావాలని సూచించారు. పోషకాహారం, ఇతర సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు.

    అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెలా పిల్లల ఎత్తు, బరువు కొలుస్తారని, ఎదుగుదల లోపించిన పిల్లలకు ప్రత్యేక వైద్యం, పోషకాహారం అందిస్తారని తెలిపారు.

    ఈ నెల 04 వ తేదీ నుంచి 09 వ తేదీ వరకు రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేలలు అన్ని ఒకే పోషకాలతో ఉండవని పేర్కొన్నారు. ఒక్కో నేలలో ఒక్కో విధమైన పోషకాలు ఉంటాయని వెల్లడించారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించాలని, దీంతో భూసార వివరాలు వస్తాయని తెలిపారు. దానికి అనుగుణంగా నేలలో ఏ పంట వేయాలి.. ఏ ఏ ఎరువులు, పురుగు మందులు ఎంత మోతాదులో వినియో గించాలో తెలుస్తుందని వెల్లడించారు.

    ఇష్టారీతిన ఎరువులు, పురుగు మందులు వాడటంతో నేల నిస్సారం అవుతుందని తెలిపారు. ఇష్టారీతిన ఎరువులు, పురుగు మందులు వాడిన పంట ఉత్పత్తుల వినియోగంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులు కచ్చితంగా శాస్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సాగు చేయాలని సూచించారు.

    సన్నవడ్లు సాగు చేయాలి

    రేషన్ దుకాణాలు, రెసిడెన్షియల్ విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అందరూ సన్న బియ్యం వినియోగిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లు సాగు చేసే రైతులకు బోనస్ అందిస్తుందని వివరించారు. విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు సన్న వడ్లు సాగు చేయాలని పిలుపు నిచ్చారు.

    అధిక దిగుబడి, లాభాలు ఉన్న ఆయిల్ పామ్ ను రైతులు సాగు చేయాలని సూచించారు. మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్, అంతర పంటల సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రారంభించారని గుర్తు చేశారు. రైతులు
    ఆయిల్ పామ్ సాగు చేయాలని పిలుపు నిచ్చారు.

    కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింగం, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్, డీపీఓ షర్ఫుద్దీన్, వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login