• Other News
  • Live TV
  • చౌక ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సన్నబియ్యం పంపిణీ పరిశీలన

    Reporter
    admin April 10, 2026, 2:31 pm
    చౌక ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ  సన్నబియ్యం పంపిణీ పరిశీలన

    రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ -10 సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చౌక ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్ లో ఉన్న చౌక ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి.. ఆన్లైన్ లో లబ్దిదారుల వివరాల నమోదు .. సన్న బియ్యం పంపిణీని పరిశీలించారు.

    ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేయాలని ఇప్పటికే అన్ని చౌక ధరల దుకాణాలకు అందించింది. ఈ సందర్భంగా పలువురు రేషన్ కార్డుల లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ఇప్పటిదాకా ఎందరు లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకువెళ్ళారు? పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రేషన్ డీలర్ ను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు.

    పరిశీలనలో సిరిసిల్ల డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర