• Other News
  • Live TV
  • ఆరోగ్యమే ప్రధానం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

    Reporter
    admin April 9, 2026, 1:34 pm
     ఆరోగ్యమే ప్రధానం    జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

    ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక లో భాగం గా... జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి 12 వ తేదీ వరకు జరుగుతున్న ఆరోగ్య వారోత్సవాల సందర్బంగా... గురువారం జనగాం సబ్ జైలు లో క్షయ, HIV, Hepatitis, కంటి, ఎక్సరె పరీక్షలను, జనరల్ మెడిసిన్, చర్మ సంబంధ సమస్యలపై 23 మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహించారు.


    ఖైదీల కోసం నిర్వహించిన హెల్త్ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వయంగా పర్యవేక్షించి, వారికి నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన పరీక్షలు మరియు ఔషధాలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత మెడికల్ అధికారులకు సూచించారు.

    ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు హెల్త్ క్యాంప్‌లో తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలన్నారు

    వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు .

    వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని.... శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు .

    జ్వరము, దగ్గు, శ్వాసకోశ సమస్యలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు

    ఈ కార్యక్రమం లో.. డా. కే మల్లిఖార్జున్ రావు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, డా అశోక్, డా కమలహాసన్, జైలు అధికారులు ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర