• Other News
  • Live TV
  • రాజన్న , మార్చి - 16 గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్

    Reporter
    admin March 16, 2026, 1:22 pm
    రాజన్న , మార్చి - 16        గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి  కలెక్టర్ గరిమ అగ్రవాల్

    పశువుల సంరక్షణకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని పశు వైద్య, పశు సంవర్ధక శాఖ, జిల్లా అధికార యంత్రాంగం ఆద్వర్యంలో సిద్ధం చేసిన ప్రచార రథాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం కలెక్టర్ ప్రారంభించారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. పశువుల పెంపకందారులు తమ జీవాల ఆరోగ్య సంరక్షణ, ఆర్థికంగా నష్ట పోకూడదనే ఉద్దేశంతో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వం ఉచితంగా వేయిస్తుందని పేర్కొన్నారు. పెంపకందారులు ముందస్తుగా టీకాలు వేయించి.. రోగాల బారి నుంచి జీవాలను రక్షించాలని సూచించారు. అన్ని పాడి పశువులు, నాలుగు నెలల వయసు దాటిన ఎద్దులు, దూడలకు పశువుల పెంపకందారులు, రైతులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, పశు వైద్య డాక్టర్లు, సిబ్బంది 26 టీమ్ లుగా ఏర్పడి వచ్చే నెల ఏప్రిల్ 9వ తేదీ వరకు టీకాలు వేస్తారని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రచార రథంతో అవగాహన కల్పించాలని సూచించారు.

     
    కార్యక్రమంలో జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర