ప్రాథమిక పాఠశాల విద్యార్థుల చదువును అంచనా వేసే అధ్యయనం "ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ"లో భాగంగా విద్యార్థులకు మాక్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గోపాలపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు.3వ తరగతి విద్యార్థులతో గణితం, ఆంగ్ల పాఠాలు చదివించారు. ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ కి సంబంధించిన మోడల్ టెస్ట్ పేపర్లలోని పలు ప్రశ్నలను అడుగుతూ విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు. ప్రతి విద్యార్థితో పాఠాన్ని చదివిస్తూ స్పష్టంగా అర్థవంతంగా చదివేందుకు మెళకువలు నేర్పారు. ప్రతి విద్యార్థి నోట్ బుక్ లో రైటింగ్ తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీలో భాగంగా జిల్లాలోని ఏ పాఠశాలలోనైనా విద్యార్థులకు ర్యాండడమైజేషన్ విధానంలో పరీక్షలు జరుగుతాయని, అందువల్ల ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధతో ఎఫ్.ఎల్.ఎస్ కి సిద్ధం చేయాలని అన్నారు. విద్యార్థులకు తరచూ మాక్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు. మండల విద్యాధికారులు ఎప్పటికప్పుడు ఈ అంశంపై సమీక్ష నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. బుధవారం బోధన కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ కఠినమైన పాఠాల పట్ల దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యా సంవత్సరం కొద్దికాలమే ఉన్నందున ప్రతి విద్యార్థి పై శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, మండల విద్యాధికారి వాసవి పాల్గొన్నారు.
TELANGANA KARIMNAGAR
ప్రాథమిక అభ్యాస అధ్యయనం" (FLS) మోడల్ పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **
మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కోనాపూర్ లో గురుకుల పాఠశాల నిర్మాణ పనులలో జాప్యం. నేటి ప్రభాతదర్శిని బాన్సువాడ ప్రతినిధి.