వేములవాడ, ఫిబ్రవరి -06
భక్తులకు సాఫీగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలి
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
వేములవాడలో శివరాత్రికి చేస్తున్న ఏర్పాట్ల పరిశీలన
మహా శివరాత్రి జాతర సందర్బంగా భక్తులకు సాఫీగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మహా శివరాత్రి జాతర సందర్బంగా వేములవాడ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో చేస్తున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం పరిశీలించారు. ముందుగా వీఐపీ దర్శనాల కోసం చేసిన ప్రత్యేక ద్వారం, బారికేడింగ్ ను పరిశీలించి శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఈఈ రాజేష్ కు సూచనలు చేశారు. క్యూ లైన్లు పరిశీలించి, నీటి సదుపాయం ఏర్పాట్లను సందర్శించి ఎక్కువ చోట్ల తాగునీటి పాయింట్లు పెట్టి భక్తులకు అందించాలని సూచించారు. అక్కడి నుంచి నూతన బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో స్వామివారి ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కళ్యాణకట్టను పరిశీలించి.. పలు సూచనలు చేశారు. మొబైల్ టాయిలెట్ల సంఖ్య మరింత పెంచాలని ఆదేశించారు.జాతర వైభవంగా నిర్వహించాలి. మహా శివరాత్రి సందర్బంగా స్వామి వారి ఆలయాన్ని పూల అలంకరణతో అందంగా ముస్తాబు చేసి.. జాతరను వైభవంగా నిర్వహించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పార్కింగ్ స్థలం వద్ద కోడెల టికెట్ కౌంటర్, పందిర్లు, శివార్చన స్టేజీ పరిశీలించారు. మహా శివరాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.
TELANGANA RAJANNA SIRCILLA
భక్తులకు సాఫీగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **
మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కోనాపూర్ లో గురుకుల పాఠశాల నిర్మాణ పనులలో జాప్యం. నేటి ప్రభాతదర్శిని బాన్సువాడ ప్రతినిధి.