• Other News
  • Live TV
  • అజాగ్రత్త నిర్లక్ష్యం వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలి...

    Reporter
    admin January 31, 2026, 3:56 pm
    అజాగ్రత్త నిర్లక్ష్యం వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు  ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలి...

    ట్రాఫిక్ రూల్స్ పాటించడం మనందరి గురుతురమైన బాధ్యత..
    భారం అనుకోవద్దు..
    మన కుటుంబంతో పాటు ఇతర కుటుంబాలకు నష్టం జరగకుండా చూసుకోవాలి..
    అజాగ్రత్త నిర్లక్ష్యం వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు
    ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలి..
    జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
    జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం ముగింపు సమావేశానికి హాజరు..
    ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మనందరి గురుతరమైన బాధ్యత అని భారం అనుకోవద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. వాహనదారులతో పాటు ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రయాణం సాగించాలని సూచించారు. సురక్షితమైన ప్రయాణం ద్వారా మన కుటుంబంతోపాటు ఇతరుల కుటుంబాలకు నష్టం కలగకుండా చూసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. శనివారం తిమ్మాపూర్ లోని ఆర్టిఏ కార్యాలయంలోని జువ్వాడి చొక్కా రావు (సారధి) చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్ ఆడిటోరియంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం ముగింపు సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాహనదారుల అజాగ్రత్త నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. ఎవరికివారు తమ బాధ్యతగా భావిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎక్కడా వాటిని బ్రేక్ చేయవద్దని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఆయా పాఠశాలల విద్యార్థులు తల్లిదండ్రులు చుట్టుపక్కల వారికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలని తెలిపారు. తిమ్మాపూర్ సారధి చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్ లో ఇప్పటివరకు దాదాపు 22,000 మంది విద్యార్థులు ట్రాఫిక్ నియమ నిబంధనలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు తిమ్మాపూర్ చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్ ను సందర్శించి రూల్స్ పై శిక్షణ పొందాలని సూచించారు. అడిషనల్ డిసిపి వెంకట రమణ ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించవచ్చన్నారు. అతివేగము నిర్లక్ష్యం అజాగ్రత్త తో నడపడం వల్ల ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. పోలీస్ శాఖ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల భాగస్వా మ్యంతోనే పూర్తిగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించవచ్చ న్నారు. ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా నెలరోజులపాటు జిల్లాలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. పోలీస్ శాఖ ఆర్ అండ్ బి శాఖ వైద్యశాఖ వివిధ శాఖలతో కలిసి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. నెలలో ఒకరోజు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన తరగతులు నిర్వహించాలని ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్ సూచించారు. రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ అవేర్నెస్ లో భాగంగా నిర్వహించిన క్విజ్ రంగోలి పోటీల్లో ప్రథమ చూపిన పలు పాఠశాలల విద్యార్థులకు మహిళలకు బహుమతులు ప్రశంసా పత్రాలు జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్ డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ ఆర్ అండ్ ఈ ఈ నరసింహ చారి ఎంవీఐ రవికుమార్ తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ ఏఎంవీఐ లు స్రవంతి, హరిత చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్ ఇన్స్ట్రక్టర్ హారిక తో పాటు పలువురు అధికారులు ఆర్టిఏ పోలీస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login