నామినేషన్ల స్వీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, జనవరి- 28:
నామినేషన్ల స్వీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశామని అన్నారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో వచ్చిందని కలెక్టర్ తెలిపారు. నేటి నుంచి జనవరి 30 వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నామని అన్నారు. పెద్దపల్లి, మంథని సుల్తానాబాద్ మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్యాలయాలలో నామినేషన్లు స్వీకరిస్తున్నామని, రామగుండం నగరపాలక సంస్థకు సంబంధించి నామినేషన్ స్వీకరణ కోసం 8 సెంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 124 వార్డుల పరిధిలో 62 రిటర్నింగ్ అధికారులు, 62 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నియమించామని తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఎలక్షన్ అబ్జర్వర్లు పద్మజ రాణి, సుజాత, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.
TELANGANA PEDDAPALLI
నామినేషన్ల స్వీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం