కామారెడ్డి జిల్లా
మహర్షి వాల్మీకి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, ధర్మం, మానవతా సూత్రాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి జీవితం, ఆయన బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజంలో నైతిక విలువలు, సమానత్వం, మానవతా భావాలను పెంపొందించుకోవాలని సూచించారు. మహనీయుల జీవిత చరిత్రలు, వారి బోధనలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)వి. విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, (జెడ్పీ సీఈఓ) చందర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నర్సయ్య, సహాయ బీసీ అభివృద్ధి అధికారి మామిండ్ల చక్రధర్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నీల నాగరాజు, ఎంబీసీ నాయకులు శ్రీనివాస్, జనార్ధన్, గణేశ్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
TELANGANA KAMAREDDY
మహర్షి వాల్మీకి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
క్రియాశీల రాజకీయాల్లో రాణిస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దసరా లోపు కీలక పదవిలో కేకే
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి