Banner
Watermark
మహర్షి వాల్మీకి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి
📅 27 October 2026, 08:39 AM ✍️ admin
News Image

కామారెడ్డి జిల్లా
మహర్షి వాల్మీకి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, ధర్మం, మానవతా సూత్రాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి జీవితం, ఆయన బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజంలో నైతిక విలువలు, సమానత్వం, మానవతా భావాలను పెంపొందించుకోవాలని సూచించారు. మహనీయుల జీవిత చరిత్రలు, వారి బోధనలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)వి. విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, (జెడ్పీ సీఈఓ) చందర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నర్సయ్య, సహాయ బీసీ అభివృద్ధి అధికారి మామిండ్ల చక్రధర్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నీల నాగరాజు, ఎంబీసీ నాయకులు శ్రీనివాస్, జనార్ధన్, గణేశ్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home