సిరిసిల్ల, జూలై 27 :సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణిలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సిరిసిల్ల మున్సిపల్ పరిధి చిన్న బోనాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో నీటి సరఫరాలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు వచ్చిన అరగంటలోనే స్పందించిన జిల్లా కలెక్టర్ ఆ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నేరుగా డైనింగ్ హాల్ కి వెళ్లి విద్యార్థులు భోజనం చేస్తుండగా, వారితో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? నాణ్యతా ఎలా ఉంది? అని ఆరా తీశారు. బియ్యం, పప్పులు, కోడిగుడ్లు, నూనె ఇతర ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీని తనిఖీ చేశారు. అక్కడి నుంచి విద్యార్థుల వసతి గదులకు వెళ్లి.. టాయిలెట్లు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వెంటనే సమస్యలు పరిష్కరించాలి
విద్యాలయంలో నీటి సరఫరాలో ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా ను పిలిపించి.. జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని వేములవాడ మహాత్మ జ్యోతి బాపూలే బాలుర గురుకుల రెసిడెన్షియల్ విద్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇటీవల తనిఖీ చేసి.. నిర్వహణలో లోపాలను గుర్తించారు. విచారణ నివేదిక ఆధారంగా ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని కలెక్టర్ గుర్తు చేశారు.
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిన్న బోనాల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ను జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
విద్యార్థులు, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతి పాఠ్యాంశం కీలకమని ప్రణాళిక ప్రకారం చదవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. వసతులను సద్వినియోగం చేసుకొని.. విద్యలో రాణించాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత అవగాహనతో ఉండాలని స్పష్టం చేశారు.
TELANGANA RAJANNA SIRCILLA
చిన్న బోనాల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ ఇటీవల ఎంజేపీ బాలుర విద్యాలయం ప్రిన్సిపాల్ సస్పెండ్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **