నేటి ప్రభాత దర్శిని ! ఎల్లారెడ్డి పేట జూలై 27 :క్రమశిక్షణ,నిబద్ధతతో ప్రజల మన్నలను పొందేలా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది పని చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ అవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ ,సివిల్,హోమ్ గార్డ్ సిబ్బందికి నిర్వహించిన వీక్లీ పరేడ్ కి జిల్లా ఎస్పీ గారు హాజరై గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్ ప్రదర్శనని పరిశీలించారు.
ఈసందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు కనీసం అరగంట నడక చేయడం, బయట ఆహారాన్ని వీలైనంత వరకు నివారించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఎస్పీ గారు సూచించారు.
వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి క్రమశిక్షణ,యూనిటీగా ఉండడం, ఫిజికల్ ఫిట్నెస్ కి ఉపయోగపడుతుందన్నారు.క్రమశిక్షణతో డ్యూటీలు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందేలాగా పనిచేస్తూ పోలీస్ శాఖకి, జిల్లాకి మంచి పేరు తెచ్చేలాగా పని చేయాలని అన్నారు.విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని,సిబ్బందికి ఏదైనా సమస్య వుంటే ఎప్పుడైనా తనను కలుసుకొని తమ సమస్యను తెలియజేవచ్చాన్నారు.
ఈపరేడ్ లో అదనపు ఎస్పీ చంద్రయ్య,ఆర్.ఐ లు మధుకర్, సురేష్,రమేష్,ఆర్.ఎస్.ఐ లు రాజు,శ్రవణ్ యాదవ్, దిలీప్, సాయి కిరణ్, ఆర్ముడ్ సిబ్బంది, సివిల్ సిబ్బంది,హోమ్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.