జులై 27
జనగాం : సోమవారం మినీ కాన్ఫెరెన్స్ హల్ లో బమ్మెర పోతన స్మృతి వనం సమగ్ర అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బమ్మెర అభివృద్ధి పనులకు సంబంధించిన సవరించిన అంచనాలను (Revised Estimate) త్వరితగతిన ఖరారు చేసి, టెండర్ ప్రక్రియను ఆలస్యం లేకుండా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
చీఫ్ ఇంజనీర్, ఆర్&బి శాఖ టెండర్ ప్రక్రియను అత్యవసరంగా చేపట్టి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.
పర్యాటక శాఖతో సమన్వయం చేసుకొని నిధుల సమీకరణకు చర్యలు తీసుకోవాలని, పనులను దశలవారీగా పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.
ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, పరిపాలనా అనుమతులను త్వరితగతిన పూర్తి చేసి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బమ్మెర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఇరిగేషన్ శాఖ, పర్యాటక శాఖ, ఆర్&బి శాఖ, సంబంధిత శాఖల అధికారులు ఇతర సభ్యులు పాల్గొన్నారు.