*ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్*
*బీ పీ పరీక్షలు చేయించుకున్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*
-----------------------------------
రాజన్న సిరిసిల్ల, జూలై -13
-----------------------------------
జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బందికి ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బీపీ పరీక్షలు చేయించుకున్నారు.
సెర్ప్, ఎరిక్సన్ టీపీఏ బీమా సంస్థ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో యశోద హాస్పిటల్స్ మలక్ పేట్ హైదరాబాద్, శరత్ మాక్సీ విజన్, కరీంనగర్ వారి సహకారంతో ఉచిత సమగ్ర వైద్య శిబిరం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
జనరల్ ఫిజీషియన్, గుండె, స్త్రీ, నేత్ర వైద్య నిపుణులు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ, డీపీఓ జయశీల తదితరులు పాల్గొన్నారు.