జర్నలిస్టు లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనీ ఆర్డీవో కు వినతి.
నేటి ప్రభాతదర్శిని బాన్సువాడ ప్రతినిధి.
బాన్సువాడ మండలంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టు లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సోమవారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఆర్డీఓ ఏ. రవీందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ గౌడ్ సభ్యులతో కలిసి ఆర్డీఓను కలిసి తమ సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా పాత్రికేయులుగా సేవలందిస్తున్న జర్నలిస్టులు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు గానీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో గానీ ఎలాంటి లబ్ధి పొందలేదని, నిజంగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న వారికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ ను కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు వీరప్ప, చిదుర శివకుమార్, పాండురంగ శర్మ, శ్రీనివాస్, ప్రవీణ్ రెడ్డి, అనిల్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.