అర్హులైన ఏ ఒక్కరు ఓటు హక్కు కోల్పోవద్దు
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు
అంకన్నగారి నాగరాజ్ గౌడ్
కామారెడ్డి నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి.
బీబీపేట్,జులై;12,మండలంలోని మాందాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తన SIR ఎన్యూమరేషన్ ఫామ్ BLO కి స్వయంగా అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లిఖార్జున్ ఆదేశాల మేరకు గ్రామంలో ఇంటింటికి ప్రజలకు SIR ఎన్యూమరేషన్ ఫారాలు అందుతున్న విధానం తెలుసుకొని అర్హుడైన ప్రతి ఓటరు తన ఓటు హక్కు కోల్పోకుండా SIR ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా పూర్తి చేసి నిర్ణీత గడువులోగా సమర్పించాలని ఓటర్లను ఆయన కోరారు. ఓటరు జాబితాలో గల ప్రతి అర్హుడి పేరు, వివరాలు సక్రమంగా నమోదు కావడం ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.
అలాగే గ్రామంలో SIR కార్యక్రమం అమలవుతున్న తీరును BLOలు ఇంటింటికి వెళ్లి విధులను నిర్వహిస్తు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా SIR ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను కోరారు
ఇంటింటికి వెళ్లి ప్రజలకు SIR ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్న BLOల సేవలను ఆయన అభినందించారు. ప్రజలందరూ అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించి, అవసరమైన వివరాలను సకాలంలో అందించి ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కోల్పోకుండా SIR ప్రక్రియ పై ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ జిల్లా అధికారులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ సూచనలు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో జిపిఓ లక్ష్మణ్, BLO లు శ్రీనివాస్ రెడ్డి, స్వామి విజయ ,గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రోడ్డ రాజు, వార్డ్ సభ్యులు శివనూరి నర్సింలు, కాంగ్రెస్ నాయకులు కమ్మరి గంగారాములు, స్వామి,శ్రీనివాస్,రమేష్, శంకరయ్య,రాములు అశోక్,సిద్ధరాములు,చేపూరి లింగం, సడుగు స్వామి తదితరులు పాల్గొన్నారు