మహిళా శక్తి చీరల పంపిణీ పథకం ద్వారా వార్డులో ఉన్నటువంటి మహిళా సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా చీరలను పంపిణీ చేసిన వార్డు కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ పథకంలో భాగంగా వార్డులో ఉన్నటువంటి మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి ఒక చీర చొప్పున పంపిణీ చేపట్టడం జరుగుతుందని, గత బి.ఆర్.ఎస్. ప్రభుత్వంలో కే.సి.ఆర్. గారు తెలంగాణలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడ బిడ్డకు బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలను ఇవ్వడం జరిగింది, కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి మహిళకు సంవత్సరానికి 2 చీరల చొప్పున ఇస్తామని చెప్పి, ఇప్పుడు మహిళా సంఘాలలో ఉన్న సభ్యులకు మాత్రమే అది కూడా ఒక్కో చీరను మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, అలా కాకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు చీరలను ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో వార్డు మాజీ కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణచందర్ , వార్డు RP లు మేఘన, మమత లు వార్డు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
సిరిసిల్ల మే 27 ( నేటి ప్రభాత దర్శిని)
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **