• Other News
  • Live TV
  • సమన్వయంతో అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష *బి.ఎస్.ఎన్.ఎల్ అండర్ గ్రౌండ్ కేబుల్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

    Reporter
    admin March 31, 2026, 3:16 pm
    సమన్వయంతో అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  *బి.ఎస్.ఎన్.ఎల్ అండర్ గ్రౌండ్ కేబుల్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

    పెద్దపల్లి, మార్చి 31:
    ------------------------------
    జిల్లాలో బి.ఎస్.ఎన్.ఎల్ అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

    మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బి.ఎస్.ఎన్.ఎల్ అండర్ గ్రౌండ్ కేబుల్ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ తో కలిసి నిర్వహించారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, రామగుండం పరిధిలో పలు చోట్ల డ్యామేజైన బి.ఎస్.ఎన్.ఎల్ అండర్ గ్రౌండ్ కేబుల్ మరో మారు వేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఆర్&బీ, మిషన్ భగీరథ, ఎన్.పి.డి.సి.ఎల్, లోకల్ బాడీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని కలెక్టర్ సూచించారు.

    నూతన విద్యుత్ పోల్స్, త్రాగు నీటి పైప్ లైన్ , రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో ఆ ప్రాంతంలో వేసిన అండర్ గ్రౌండ్ డ్యామేజ్ కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

    సెల్ ఫోన్ నెట్ వర్క్ సజావుగా కొనసాగేందుకు వేసవి కాలంలో విద్యుత్ కోతలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని, మెయింటెనెన్స్ పనుల నిమిత్తం కరెంట్ కోతులు విధించే అవసరం వస్తే బ్యాకప్ ముగిసే లోపు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగేలా చూడాలని అన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్, బి.ఎస్.ఎన్.ఎల్ అండర్ గ్రౌండ్ కేబుల్ సంబంధించి
    ప్రతి నెలా సంబంధిత శాఖ అధికారులు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

    ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ కాళిందిని,ఆర్ అండ్ బి ఈ ఈ బావ్ సింగ్ , సి సెక్షన్ సూపరిండెంట్ కుమారస్వామి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    ---------------------------------------------------
    జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర