• Other News
  • Live TV
  • ఆర్ఎస్ఎస్ అంటే దేశభక్తులను తయారు చేసే పరిశ్రమ

    Reporter
    admin October 26, 2026, 4:15 pm
    ఆర్ఎస్ఎస్ అంటే దేశభక్తులను తయారు చేసే పరిశ్రమ

    రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు.

    బిజెపి రాష్ట్ర నాయకులు మర్రిపెల్లి సత్యమ్.

    నేటి ప్రభాత దర్శిని పెగడపల్లి అక్టోబర్ 26

    పెగడపెల్లి : మహిళలను పురుషుల ఆస్తిగా ఆర్ఎస్ఎస్ భావిస్తుందని రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమైన భావజాలం గల సంస్థ ఆర్ఎస్ఎస్ అని రాహుల్ గాంధీ ఆరెస్సెస్ ను ఆటంక వాదులతో పోల్చిన్ నేహా బోరా చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అందుకుగాను వెంటనే క్షమాపణ చెప్పాలని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్ డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ అంటే సేవా భావంతో కూడిన జాతీయ వాదులను దేశభక్తులను తయారు చేసే గొప్ప పరిశ్రమ అని అలాంటి సంస్థపై నీచంగా ఆరోపణలు చేయడం సూర్యుడిపై ఉమ్మేయడం లాంటిదేనని అన్నారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 18 విభాగాలు సేవాభావంతో నిస్వార్థంతో పనిచేస్తున్నాయని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తర భారతదేశం అతలాకుతలమైనప్పుడు భూకంపాలు సంభవించినప్పుడు ముందుండి సేవలందించిన ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ అని అంతేకాకుండా గతంలో మొంత తుఫాన్ ప్రభావం వల్ల ఖమ్మం వరంగల్ జిల్లాలు నీట మునిగితే తెలంగాణ ప్రభుత్వం కంటే ముందే స్పందించి బాధితులకు నిత్యవసరాలు సరాఫరా చేసి ఆదుకున్న సంస్థ ఆర్ఎస్ఎస్ అని కొనియాడారు.నెహ్రూ హయాంలో 1962లో భారతదేశానికి,చైనాకు యుద్ధం జరిగిన సమయంలో భారతదేశంలోని కమ్యూనిస్టులు చైనాకు వంతపాడితే స్వయం సేవకులు మాత్రం భారత సైన్యానికి చేదోడు వాదోడుగా ఉంటూ భారత సైన్యానికి భోజనం,వైద్యం లాంటి సదుపాయాలు సమకూర్చి భారత సైన్యానికి అన్ని విధాల సహాయం చేశారని ఆర్ఎస్ఎస్ చేసిన సేవలకు గాను అప్పటి ప్రధాని నెహ్రూ ఆర్ఎస్ఎస్ ను మెచ్చుకుని 1963 జనవరి 26 నాడు జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాలకు భారత సైన్యంతో కలిసి కవాతులో పాల్గొనవలసిందిగా ఆర్ఎస్ఎస్ కు నెహ్రూ ఆహ్వానం పంపితే 3500 మంది ఆర్ ఎస్ ఎస్ స్వయం సేవకులు పూర్తి గణవేశ్ తో బ్యాండ్ తో సహా పాల్గొన్నారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి భారతదేశ చరిత్ర తెలియదని తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. ఎప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లిన సొంత దేశాన్ని చులకన చేసి మాట్లాడడం రాహుల్ కు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు.ఇందిరాగాంధీ హయంలో 2500 మంది సిక్కులను ఊచకోత కోసిందని రాజీవ్ గాంధీ హయాంలో 5000 పైచిలుకు తమిళులను చంపితే రాహుల్ గాంధీకి దేశభక్తులుగా కనిపిస్తున్నారని కానీ ఒక్క గాంధీని చంపిన గాడ్సే మాత్రం దేశద్రోహిగా కనిపిస్తే ఆర్ఎస్ఎస్ సంస్థను నిందించడం విడ్డూరంగా ఉందన్నారు.ఆర్ఎస్ఎస్ లేకుంటే పంజాబ్, జమ్మూ కాశ్మీర్, పశ్చిమబెంగాల్ పాకిస్తాన్లో అంతర్భాగం అయ్యేవని స్వయం సేవకులు ప్రచారకుల సహాయంతో నిస్వార్ధంగా దేశానికి సంస్కృతికి సేవలందిస్తున్న అతిపెద్ద జాతీయవాద సంస్థ ఆర్ఎస్ఎస్ అని కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో రాజ్యాంగాన్ని కేవల ఒక వర్గం మెప్పు కోసమే అత్యధిక సార్లు సవరించి దేశ గౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడే రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
    masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
    inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login
    https://trueblutravel.com/vovo88