Banner
Watermark
అనుమానస్పదంగా బిల్ కలెక్టర్ మృతి..
📅 30 August 2026, 04:06 PM ✍️ admin
News Image
అనుమానస్పదంగా బిల్ కలెక్టర్ మృతి..

ఎల్లారెడ్డిపేట ఆగస్టు 30 ( నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి )

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం అనుమానాస్పదంగా బిల్ కలెక్టర్ మృతి చెందారు,
ముస్తాబాద్ మండలంలోని గోపాల్ పల్లి గ్రామపంచాయతీలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గంభీరావుపేట గ్రామానికి చెందిన నవీన్ అనుమానస్పదంగా ఎల్లారెడ్డిపేటలోని నివాసముంటున్న ఇంట్లో మృతి చెందాడు.. తన భార్య రాఖీలు కట్టేందుకు పుట్టింటికి వెళ్లిన అనంతరం ఈ ఘటన జరిగినట్లు సమాచారం.. కాగా నవీన్ గతంలో ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీలో విధులు నిర్వహించాడు. జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అతనికి భార్య కుమారుడు ఉన్నారు, ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు,
🏠 Home