Banner
Watermark
ప్రముఖ క్రీడా కారుడు ద్యాను చందు జన్మదిన రోజునా నేసషనల్ స్పోర్ట్స్ డే
📅 29 August 2026, 02:18 PM ✍️ admin
News Image
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి అనుమతితో మేజర్ ధ్యాన్ చంద్ జన్మదిన పురస్కరించుకొని ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే 2026 సందర్భంగా సిరిసిల్ల మినీ స్టేడియంలో వాలీబాల్ కబడ్డీ మరియు ఆర్చరీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి పోటీలలో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు విజేతలకు. అలాగే జాతియ స్థాయిలో వివిద క్రీడాంశాలలో పాల్గొని గెలుపొందిన విజేతలు 20 మందికి జిల్లా విద్యాధికారి మొండయ్య గారు , జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ అఫ్జల్ బేగం గారు మరియు నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ గారిచేతుల మీదుగా ప్రథమ ద్వితీయ బహుమతులు గోల్డ్ సిల్వర్ మెడల్స్ మరియు మెమెంటోలు, ప్రశంస పత్రాలు అందజేశారు. మరియు జిల్లా యువజన మరియు క్రీడలశాఖ అధికారి ఏ రాందాస్ గారి అధ్యక్షతన జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నోడల్ ఆఫీసర్ డి ప్రభాకర్ గారు , వాలీబాల్ అకాడమీ కోచ్లు అలాగే కబడ్డీ కోచ్ ఇతర క్రీడాకారులు మరియు క్రీడాకారుల తల్లిదండ్రులు యూత్ అసోసియేషన్ సభ్యులు అలాగే పాఠశాల మరియు కళాశాల బాల బాలికలు అందరూ దాదాపు 210 మంది పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
🏠 Home